'వాజ్పేయిని స్కూటర్పై తీసుకెళ్లేవాణ్ని' | Shared rare friendship with Vajpayee: Advani | Sakshi
Sakshi News home page

'వాజ్పేయిని స్కూటర్పై తీసుకెళ్లేవాణ్ని'

Published Wed, Dec 24 2014 7:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'వాజ్పేయిని స్కూటర్పై తీసుకెళ్లేవాణ్ని' - Sakshi

'వాజ్పేయిని స్కూటర్పై తీసుకెళ్లేవాణ్ని'

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్పేయితో తన స్నేహం అపూర్వమైనదని బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని ఎల్ కే అద్వానీ అన్నారు. వాజ్పేయికి అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో అద్వానీ మాట్లాడుతూ.. వాజ్పేయితో తన సుదీర్ఘ స్నేహబంధాన్నిగుర్తు చేసుకున్నారు.

వాజ్పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్పై తిరిగేవాళ్లమని అద్వానీ చెప్పారు. వాజ్పేయిని తన స్కూటర్పై వెనుక కూర్చొబెట్టుకుని చాట్ తినేందుకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్ కు వెళ్లేవారిమని గుర్తుచేసుకున్నారు. అటల్ జీకి చాట్ అంటే చాలా ఇష్టమని ఆయన కోసం తాను వెళ్లేవాడినని చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీగా ఎదుగుదలలో వాజ్పేయి, అద్వానీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement