తుంగభద్రలో వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం | Vajpayee ashes immersed in Tungabhadra | Sakshi
Sakshi News home page

తుంగభద్రలో వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం

Published Sun, Aug 26 2018 12:52 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

Vajpayee ashes immersed in Tungabhadra - Sakshi

అలంపూర్‌లోని తుంగభద్ర (దేవద్రోణి తీర్థంలో) జలాల్లో వాజ్‌పేయి చితాభస్మాన్ని కలుపుతున్న కిషన్‌రెడ్డి

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చితాభస్మాన్ని శనివారం తుంగభద్ర నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ వద్ద తుంగభద్ర నదిలో బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత నదీ తీరంలోని పుష్కరఘాట్‌లో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఉత్తర వాహిణి తుంగభద్ర నదిలోని పవిత్ర దేవద్రోణి తీర్థంలో చితాభస్మాన్ని కలిపి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆత్మకు వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుతూ అర్ఘ్యం వదిలారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ వాజ్‌పేయి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నాగూరావు నామోజీ, పద్మజరెడ్డి, తుమ్మల రవికుమార్, అశోక్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement