భరించాల్సిన బాధ్యత భర్తదే.. | husband is the responsibility.. | Sakshi
Sakshi News home page

భరించాల్సిన బాధ్యత భర్తదే..

Published Tue, Oct 11 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

husband is the responsibility..

బాగోగులతో అత్తమామలకు సంబంధం లేదు: ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ: భర్త నుంచి మాత్రమే వసతి, నిర్వహణ సౌకర్యం పొందే హక్కు భార్యకు ఉంటుందని, అత్త, మామలకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఒక గృహహింస కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి అనిల్‌కుమార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక మహిళ వివాహం చేసుకొని తన భర్త, అత్తమామలతో నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో నివాసం ఉండేది. అయితే మనస్పర్థల కారణంగా అత్తమామలు కొడుకు, కోడలిని బయటకు పంపారు.

ఈ క్రమంలో ఆ మహిళ తన వసతి, నిర్వహణ ఖర్చులు అత్తమామలు భరించాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోడలికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆమె అత్త సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. తన ఆస్తిలో కోడలికి నివాసం కల్పించడం కుదరదని, అ బాధ్యత కేవలం ఆమె భర్తపైనే ఉంటుందంటూ వాదించింది. ఈ వాదనతో ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement