న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. కుంభకోణంలో కుమార మంగళం బిర్లా, ఇతరుల పాత్రపై
విచారణ చేపట్టింది. అనంతరం సీబీఐ...హిందాల్కొ, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్కు సంబంధించిన కేసు డైరీని కోర్టుకు సమర్పించింది. విచారణకు డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
ఈ కుంభకోణంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, బొగ్గు శాఖ మంత్రిని ఎందుకు ప్రశ్నించ లేదని కోర్టు మంగళవారం సీబీఐను ప్రశ్నించింది. అందుకు సంబంధించిన కేసు వివరాలను సమర్పించాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు గురువారం సీబీఐ సమర్పించింది.