సాక్షి, హైదరాబాద్: జగన్ కేసుల విషయంలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి విచారణను త్వరగా పూర్తి చేయాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. దోషిగా తేలితే చట్టపరంగా శిక్షించాలని, నిర్దోషిగా తేలితే ఆయన గౌరవప్రదంగా ప్రజలలో ఉంటారన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌కు బెయిల్ వెనుక దురుద్దేశాలున్నాయని ఎటువంటి ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయలేనన్నారు. మహిళల రక్షణ విషయంలో నిర్భ య కేసులాగే ప్రజాప్రయోజనాల పరిరక్షణ విషయంలో జగన్ కేసు కూడా సంకేతంగా నిలుస్తుందన్నారు. చంద్రబాబుపై ఐఎంజీ వ్యవహారంలో సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించగా కీలక నేతలందరికి సంబంధించిన కేసులన్నింటిపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం పరిష్కరించాలన్నారు.