సీఎం జగన్‌ అధ్యక్షతన 27న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం | YSRCP Key Meeting On February 27th, CM Jagan Will Give Direction On Election Management Activities - Sakshi
Sakshi News home page

YSRCP Key Meeting: సీఎం జగన్‌ అధ్యక్షతన 27న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం

Published Sun, Feb 25 2024 9:10 PM | Last Updated on Mon, Feb 26 2024 9:39 AM

Ysrcp Key Meeting On February 27th - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 27న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు, వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభ­లకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.

ఇదీ చదవండి: జనసేన పరిస్థితి ఇంత హీనమా?.. పవన్‌పై హరిరామజోగయ్య ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement