రేపు జైట్లీతో మోదీ కీలక భేటీ
Published Mon, Sep 18 2017 8:04 PM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం అత్యున్నత భేటీ నిర్వహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండటం గమనార్హం.
మరోవైపు జీఎస్‌టీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులూ పన్ను రాబడిపై ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటితో పాటు నోట్ల రద్దు అనంతరం నల్లధనం చెలామణిపై దూకుడుగా వెళ్లడం వంటి అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.ఆర్థిక వృద్ధి మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రభుత్వ వ్యయంపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ధరల నియంత్రణకు ఏం చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేయనున్నారు.
Advertisement
Advertisement