బాలల హక్కుల్ని ఎలా పరిరక్షిస్తున్నారు?
బాలల హక్కుల్ని ఎలా పరిరక్షిస్తున్నారు?
Published Fri, Sep 23 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
* సోషియాలజీ విద్యార్థులను ప్రశ్నించిన విదేశీ ప్రతినిధులు
* ఏఎన్‌యూను సందర్శించిన బృందం
గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాన్ని శుక్రవారం ఆస్ట్రియా, జర్మనీ దేశాల సోషల్ వర్క్ విద్యార్థులు, సామాజిక కార్యకర్తల బృందం సందర్శించింది. విజయవాడలోని నవజీవన్ బాలభవన్ స్వచ్ఛంద సంస్థకు ఇంటెన్షిప్ కోసం వచ్చిన పై దేశాలకు చెందిన బెట్టీనా ఐచ్చింగర్, లూకాస్ హీగల్స్‌బర్గర్, రెబ్కా హంబర్గ్, మైఖేల్ స్టిచ్, క్రిస్టియన్ వెయిల్గునిలు సోషియాలజీ విద్యార్థులతో చర్చించేందుకు ఏఎన్‌యూకి వచ్చారు. భారతదేశంలోని సామాజిక అంశాలు, చట్టాల గురించి తెలుసుకున్నారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్‌ల పాత్రపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమంలో సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగ ఇన్‌చార్జి కో–ఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, అధ్యాపకులు డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, నవజీవన్ బాలభవన్ కో–ఆర్డినేటర్ భాను, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ సందర్శన
అనంతరం ఆస్ట్రియా, జర్మనీ దేశాల ప్రతినిధులు ఏఎన్‌యూలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్‌ను సందర్శించారు. ఇక్కడ చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులను కలిసి వారి చదువులు, కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. స్టూడెంట్ సెల్ అడిషనల్ డైరెక్టర్ ఆచార్య ఆంజనేయులు ఏఎన్‌యూలో విదేశీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యాపరమైన చర్యలను బృందానికి వివరించారు.
Advertisement