విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
Published Sat, Nov 5 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
ఏఎన్‌యూ: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ 2015–16లో విద్యాపరమైన అంశాల్లో ప్రతిభ కనబరచిన విదార్థులకు ప్రతిభా పురస్కాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ అమతవల్లి మాట్లాడుతూ ప్రతిభ కనబరచిన 177 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించామని తెలిపారు. పురస్కార గ్రహీతకు సర్టిఫికెట్, బంగారు పతకం, ఎలక్ట్రానిక్ ట్యాబ్‌లెట్, 20 వేల రూపాయల నగదు అందజేస్తున్నామని వెల్లడించారు. యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్, విద్యార్థి వ్యవహారాల కో–ర్డినేటర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్, అంబేద్కర్ చైర్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement