pratibha awards
-
తొలిసారిగా గవర్నర్ ప్రతిభా అవార్డులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ‘గవర్న ర్ ప్రతిభా అవార్డులు’ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ నిర్ణయించారు. ఈ అవార్డులను వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘గవర్నర్ ఎట్ హోం’కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రదానం చేస్తారని గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఒక్కో అవార్డుకు రూ.2 లక్షలతో పాటు ఒక మెడల్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.రాజ్భవ న్లో శుక్రవారం బుర్రా వెంకటేశం విలేకరులతో మాట్లాడుతూ...అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో పనిచేసిన వారు, తెలంగాణేతరులైనా దరఖాస్తు చేసుకోవచ్చని అయితే రాష్ట్రంలో కనీసం ఐదేళ్లు పని చేస్తూ ఉండాలని చెప్పారు. ఈ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 2 నుంచి ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.నాలుగు విభాగాల నుంచి ఆహ్వానం...దరఖాస్తులను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని బుర్రా వెంకటేశం వెల్లడించారు. https://governor.telangana.gov.in లేదంటే గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500041 కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అన్ని డాక్యుమెంట్లతో పాటు సమర్పించాలని కోరారు. గవర్నర్ ఎంపిక చేసిన కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అవార్డులను ఎంపిక చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటల విభాగం, సాంస్కృతిక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తున్నారు. ఇందులో ఎనిమిది మందికి అవార్డులు ఇవ్వనున్నారు. -
పేరు మార్పుపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. -
ప్రియాంకకు ప్రతిభ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడల్లో రాణిస్తున్న వర్ధమాన క్రీడాకారులకు శనివారం అవార్డులను అందజేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్‌లో ప్రతిభ కనబరుస్తోన్న కె. ప్రియాంక చౌదరి ప్రతిభా పురస్కారాన్ని గెలుచుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు, రాచకొండ కమిషనర్ మహేశ్ భాగవత్ చేతుల మీదుగా ఆమె ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ స్పో ర్ట్స్ పర్సన్ అవార్డుతోపాటు ఆమెకు రూ. 51,116 నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తనను ప్రోత్స హించిన కోచ్ పులి రవీందర్ కుమార్ (సాయ్), రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం డీవైఎస్ఓ వెంకటేశ్వర రావుకు కృతజ్ఞతలు తెలిపింది. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ఏఎన్‌యూ: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ 2015–16లో విద్యాపరమైన అంశాల్లో ప్రతిభ కనబరచిన విదార్థులకు ప్రతిభా పురస్కాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ అమతవల్లి మాట్లాడుతూ ప్రతిభ కనబరచిన 177 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించామని తెలిపారు. పురస్కార గ్రహీతకు సర్టిఫికెట్, బంగారు పతకం, ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్, 20 వేల రూపాయల నగదు అందజేస్తున్నామని వెల్లడించారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్, విద్యార్థి వ్యవహారాల కో–ర్డినేటర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్, అంబేద్కర్ చైర్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు సత్కారం
-
‘కార్పొరేట్’కు సర్కార్ రెడ్ కార్పెట్
మంగళగిరి: ప్రతిభా పురస్కారాల ఎంపికలో సర్కార్ కార్పొరేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై వివక్ష చూపిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతిలో ప్రతిభ కనపరచిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు వారిని విస్మరించి ప్రై వేటు పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. మంగళగిరి మండలంలో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేయగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అని వివరించారు. రాజధాని గ్రామాల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతు కూలీలు, చేతివృత్తుల వారు పిల్లలను చదివించలేక కూలి పనులకు పంపుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు గులాం చేయడం మానుకుని ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఆర్కే సూచించారు. -
‘ప్రతిభా’శీలురకు అన్యాయం
* ప్రతిభా పురస్కారాల ఎంపికలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అన్యాయం * 76 శాతం ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఎంపిక ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల నడుమ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉత్తీర్ణత సాధిం చిన పేద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ఎంపికలో అన్యాయం చేసింది. గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 342 మంది విద్యార్థులను ప్రభుత్వం ఇటీవల ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో చదివి అత్యధిక జీఏపీ సాధించిన విద్యార్థులున్నారు. ప్రతిభా పురస్కారం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 వేలు చొప్పున నగదు, ప్రసంశాపత్రం అందించనుంది. ప్రతి యేటా ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులనే అధిక సంఖ్యలో ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేస్తున్న సంప్రదాయానికి విద్యాశాఖ ఈ ఏడాది తిలోదకాలిచ్చింది. ఫలితంగా జిల్లాలో ఎంపిక చేసిన 342 మందిలో 260 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. జిల్లాలోని 57 మండలాల వారీగా మం డలానికి ఆరుగురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో ఇద్దరు జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలికా విభాగాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మెరిట్, రోస్టర్ ఆధారంగా ఎంపిక చేశారు. జిల్లాలో 94.76 శాతం ఉత్తీర్ణత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాల జాబితాలో పేద కుటుంబాల ప్రతిభావంతులకు చోటు దక్కలేదు. గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 30,786 మంది విద్యార్థులు హాజరు కాగా, వారి లో 28,561 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 94.76 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కృషి దాగి ఉంది. 41 మందికి 10 జీపీఏ.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన 41 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఆయా యాజమాన్యాల్లోని 123 స్కూళ్లు నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు గట్టి పోటీ ఇచ్చాయి. అయితే జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పదిలంగా ఉంచడంలో కృషి చేసిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. -
శశి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ఉండ్రాజవరం, (తణుకు టౌన్) : వేలివెన్ను, కానూరు శశి విద్యాసంస్థలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపికైనట్టు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకష్ణ తెలిపారు. వేలివెన్ను క్యాంపస్‌కు సంబంధించి పోతుల దుర్గాప్రసాద్, గూడపాటి బాలకష్ణ, కురం రాణి, కానూరు కాంపస్ నుంచి బద్ది దుర్గాభవాని, ఉప్పలపాటి మౌనిక, వెంపాటి సూర్యతేజ, నంద్యాల నవ్యశ్రీ, తాడి ఆమని, యారసామి లోహితలక్ష్మి ఎంపికైనట్టు తెలిపారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మేకా నరేంద్ర కష్ణ, క్రాంతిసుధ అభినందించారు. -
బాబు సర్కార్ 'ఉత్తమ' కక్కుర్తి
- ప్రతిభా అవార్డులు సాధించిన చిన్నారులకు మొండిచెయ్యి - ఒక్కో విద్యార్థికి రూ. 20 వేలు ఇస్తామన్న సీఎం ప్రకటన గాలికి.. - ప్రశంసాపత్రాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం సాక్షి, చిత్తూరు: ఉత్తమ విద్యార్థులకు అందించే నగదు పురస్కారాల్లో ప్రభుత్వం కక్కుర్తి చూపిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రశంసా పత్రాలు చేతిలోపెట్టి.. పైసలు ఇవ్వడం మాత్రం మర్చిపోయింది. సొంత జిల్లా చిత్తూరులో సాక్షాత్తు ముఖ్యమంత్రే బహిరంగ సభలో చెసిన వాగ్ధానం నీటిమూటలా మారింది. 2015 ఏడాదికి గాను రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 4,050 మంది ప్రతిభా అవార్డులకు ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థికి ప్రశంసాపత్రంతోపాటు రూ. 20 వేల నగదు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం రూ.8.10 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అవార్డు సొమ్మును విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే జమచేస్తామంటూ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకున్నారు. నవంబర్ 14న తిరుపతిలో అర్భాటంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. అవార్డుల కార్యక్రమం ముగిసి మూడు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఒక్కపైసా చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఇవ్వలేదు గతేఏడాది చిత్తూరు క్యాంఫర్డ్ పాఠశాలలో చదివి పదవ తరగతిలో 10 పాయింట్లు సాధించాను. ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యాను. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం ఇచ్చారు. రూ 20 వేలను బ్యాంకుఖాతాలో వేస్తామన్నారు. ఇంతవరకూ జమ కాలేదు. - జి. దివ్య, క్యాంఫర్డ్ పాఠశాల, చిత్తూరు నగదు ఇవ్వనిమాట నిజమే విద్యార్థులకు ప్రతిభా అవార్డుల కింద ఇచ్చే మొత్తం మంజూరు కాని మాట నిజమే. జిల్లాకు సంబంధించి 400 మంది విద్యార్థులకు డబ్బులు ఇవ్వాలి. అందరి బ్యాంకుఖాతాలు పంపమంటే పంపం. మాచేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తుంది. - నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి అవార్డులిచ్చిన రోజే నగదు చెల్లించాలి ప్రతిభా అవార్డులు ఇచ్చిన రోజే విద్యార్థులకు నగదు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు అందజేయకపోవడం దారుణం. ఈ విషయాన్ని మా యూనియన్ తరఫున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వారికి న్యాయం జరిగేలా చేస్తాం. - కత్తినరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు