గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ కౌన్సెలింగ్ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ వివరాలు, ఫీజుల వివరాలు, కళాశాలల జాబితాలను www.anudoa.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఏఎన్‌యూ పరిధిలోని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో మొత్తం 6 వేలకు పైగా సీట్లు ఉండగా ఏఎన్‌యూ పీజీ సెట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి 7,560 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పీజీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఎం. రామిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.