ఏఎన్‌యూకి పుష్కర సెలవులు | holly days for ANU | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూకి పుష్కర సెలవులు

Published Sat, Aug 6 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

holly days for ANU

ఏఎన్‌యూ: పుష్కరాలను పురస్కరించుకుని ఏఎన్‌యూకి సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ పరిసరాల నుంచి యూనివర్సిటీకి వచ్చే సిబ్బంది, విద్యార్థులకు ట్రాఫిక్‌ సమస్య ఉండటం, పుష్కర విధులకు హాజరయ్యే పోలీసులకు ఏఎన్‌యూ వసతి గృహాల్లో వసతి ఇవ్వాలని పోలీసు అధికారులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బందికి అమరావతి బాలుర వసతి గహంలో వసతి కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ సెలవులు సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులకు అందరికా లేక అధ్యాపకేతర సిబ్బంది విధులకు హాజరు కావాలా అనే అంశాన్ని సోమవారం జరిగే ప్రిన్సిపాల్స్‌ సమావేశంలో ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement