holly days
-
11 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి,అమరావతి: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. 20వ తేదీన హైకోర్టు పునః ప్రారంభం అవుతుంది. ఈ సెలవుల్లో దాఖలయ్యే అత్యవసర కేసులను న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ మంతోజు గంగారావు విచారించనున్నారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రఘునందన్‌రావు బెంచ్‌లో, జస్టిస్ గంగారావు సింగిల్‌గా కేసులను విచారిస్తారు. ఈ నెల 12న ఈ ముగ్గురు న్యాయమూర్తులు తమ ముందు దాఖలయ్యే కేసులను విచారిస్తారు. కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 11న దాఖలు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి భౌతిక విచారణ.. రాష్ట్ర హైకోర్టులో నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ మొదలు కానుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న హైబ్రీడ్ విచారణ (భౌతిక, వీడియో కాన్ఫరెన్స్) విధానం ఈ నెల 31 వరకు కొనసాగనుంది. కోవిడ్ నేపథ్యంలో 2020 మే నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతూ వస్తోంది. ఇటీవల కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో హైకోర్టు ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ విచారణ చేపట్టింది. కోవిడ్ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ ద్వారా కేసులను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. -
ఆ న్యూస్ పూర్తిగా అవాస్తవం.. వైరల్ చేయొద్దు!
సాక్షి, అమరావతి : గత కొన్ని రోజులుగా పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అవాస్తవమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సాకు చూపి మార్చి 1వ తేదీ నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదన్నారు. అది పూర్తిగా అవాస్తవం.. దాన్ని ఎవరూ వైరల్ చేయద్దన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. సైబర్ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు కూడా షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని వెల్లడించారు. నాడు,నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. చదవండి : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ -
అయ్యో..! బస్సులొస్తున్నాయ్.. పోతున్నాయ్..
-
పుష్కర రోజుల్లో సెలవులు రద్దు
వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నాయక్ అమరావతి: అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను శనివారం ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ బీకే నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పుష్కరాల 12 రోజులపాటు సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పీ సాయిబాబు ఉన్నారు. -
ఏఎన్‌యూకి పుష్కర సెలవులు
ఏఎన్‌యూ: పుష్కరాలను పురస్కరించుకుని ఏఎన్‌యూకి సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ పరిసరాల నుంచి యూనివర్సిటీకి వచ్చే సిబ్బంది, విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య ఉండటం, పుష్కర విధులకు హాజరయ్యే పోలీసులకు ఏఎన్‌యూ వసతి గృహాల్లో వసతి ఇవ్వాలని పోలీసు అధికారులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బందికి అమరావతి బాలుర వసతి గహంలో వసతి కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ సెలవులు సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులకు అందరికా లేక అధ్యాపకేతర సిబ్బంది విధులకు హాజరు కావాలా అనే అంశాన్ని సోమవారం జరిగే ప్రిన్సిపాల్స్ సమావేశంలో ప్రకటించనున్నారు.