
సాక్షి, అమరావతి : గత కొన్ని రోజులుగా పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అవాస్తవమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సాకు చూపి మార్చి 1వ తేదీ నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదన్నారు. అది పూర్తిగా అవాస్తవం.. దాన్ని ఎవరూ వైరల్ చేయద్దన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
సైబర్ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు కూడా షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని వెల్లడించారు. నాడు,నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment