
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
భాగ్యనగర్ కాలనీ: కుటుంబ కలహాల కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన బండా అశోక్ (29) హెచ్‌ఎంటి హిల్స్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య స్వప్న, కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య విబేధాలు, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అతని భార్య స్వప్న 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో మనస్థాపానికిలోనైన అశోక్ మంగళవారం రాత్రి బ్యాగుతో సహా ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్వాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడేముందుకు అతను అమెరికాలో ఉంటున్న తన సోదరుడికి ’తన కుమారుడు మిట్టును జాగ్రత్తగా చూసుకోవాలని..తన భార్య స్వప్న మరో వివాహం చేసుకోవాలని మెసేజ్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.