నిశ్చితార్థ విందుకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శవమై తేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మల్కాజ్గిరి: నిశ్చితార్థ విందుకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శవమై తేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి కథనం.. వెంకటేశ్వరనగర్ సత్య అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న సుబ్బారావు కుమారుడు కె. శ్రీనివాస్(36) సాప్ట్‌వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి సుబ్బారావు స్నేహితుడు మీర్జాలగూడకు చెందిన రమేష్ కూతురు నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీనివాస్ పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారుజామున విందు జరిగిన ప్రాంతంలో శ్రీనివాస్ మృతి చెందిపడి ఉన్న సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు.
మృతుడి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేవు. పోస్ట్‌మార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు.