హెచ్1 బి వీసాలపై స్పందించిన మోదీ
హెచ్1 బి వీసాలపై స్పందించిన మోదీ
Published Tue, Feb 21 2017 8:09 PM | Last Updated on Wed, Sep 26 2018 6:40 PM
నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో కాస్త విశాల హృదయంతో ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాను కోరారు. 'అమెరికా ఫస్ట్' అన్న డోనాల్డ్ ట్రంప్ విధానాలు, హెచ్1బి వీసాల సంఖ్యపై వేటు.. తదితర పరిణామాల నేపథ్యంలో మోదీ ఈ అంశంపై స్పందించారు. హెచ్1బి వీసాలను తగ్గిస్తే.. 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ సేవల పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ప్రధానంగా అమెరికాకు సాఫ్ట్‌వేర్ ఎగుమతుల మీదే ఈ పరిశ్రమ ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని పరిపుష్ఠం చేయడంలో నిపుణులైన భారతీయుల పాత్రను మోదీ ప్రస్తావించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కాంగ్రెస్ నుంచి వచ్చిన 26 మంది సభ్యుల బృందాన్ని కలిసిన సందర్భంగా మోదీ ఈ విషయం వారికి తెలిపారు. సమతుల్యతతో కూడిన, దూరదృష్టి కలిగిన కోణంలో వృత్తినిపుణుల విషయంలో ఆలోచించాలని ప్రధాని కోరినట్లు పీఎంఓ తెలిపింది.
Advertisement
Advertisement