తొలి ప్రయత్నంలోనే జాబ్ సొంతం చేసుకోండిలా..
► జనవరి 21 నుంచి సాక్షి ఎడ్జ్ ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణ కోర్సు
► పట్టభద్రులైన యువత కోసం 20 రోజుల పాటు శిక్షణ
► ఆసక్తిగల వారు 9603533300ను సంప్రదించవచ్చు
హైదరాబాద్: తల్లిదండ్రులేమో మావాడు గొప్ప ఉద్యోగం సంపాదిస్తాడని కలలు కంటూ ఉంటారు. కాలేజీలో చూస్తే ఆ విద్యార్థికి మంచి మార్కులే ఉంటాయి. కానీ ఉద్యోగ సాధనలో భాగంగా హాజరైన తొలి ఇంటర్వ్యూలోనే విఫలమై వెనుదిరుగుతాడు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు... ఇలా పెద్ద చదువు చదివిన చాలా మంది విద్యార్థుల బాధ ఇలాంటిదే. అలాగని వీరందరికి సత్తా లేదని కాదు.. ఉద్యోగం సంపాదించుకోవడం కోసం కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడమే కారణం. అలాంటి విద్యార్థులకు ఇంటర్వ్యూలలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి అవలీలగా జాబ్ సొంతం చేసుకునే మెళకువలను అందించేందుకు సాక్షి ఎడ్జ్ ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణ కోర్సును పరిచయం చేస్తోంది.
20 రోజుల వ్యవధిగల ఈ కోర్సు... విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, బృంద చర్చలు, నాయకత్వ లక్షణాలు, విషయాన్ని వివరించే తీరు, బృంద నిర్మాణంలో శిక్షణార్థుల సామర్థ్యాన్ని పెంచే దిశగా ఉండనుంది. పలు రంగాల్లో మానవ వనరుల విభాగంలో విస్తృత అనుభవమున్న నిపుణులతో రూపొందించిన ఈ కోర్సు ఉద్యోగ, జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మీకిస్తుంది. జనవరి 21న ప్రారంభం కానున్న ఈ కోర్సు ఫీజు రూ.4,600 మాత్రమే. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న ‘సాక్షి జర్నలిజం స్కూల్’ప్రాంగణంలో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య తరగతులు ఉంటాయి.
రిజిస్ట్రేషన్: సాక్షి టీవీ, 6–3–248/3, సాక్షి టవర్స్, రోడ్డు నంబర్ 1, బంజా రాహిల్స్. ఈ చిరునామాలో ఔత్సాహిక అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసు కోవచ్చు. మరిన్ని వివరాలను 9603533300 నంబర్‌కు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆంగ్లంపై మంచి పట్టు ఉన్నవారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది. ఒకవేళ ఆంగ్లంపై అంత గా పట్టులేకపోతే సాక్షి ఎడ్జ్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును ఎంచుకుంటే మంచిది.