చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి హత్య కేసులో పురోగతి లభించింది. నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ ను రైల్వే పోలీసులు విడుదల చేశారు.
చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి హత్య కేసులో పురోగతి లభించింది. నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ ను రైల్వే పోలీసులు విడుదల చేశారు. అందరూ చూస్తుండగానే స్వాతి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చెన్నై నుంగంబక్కమ్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం దారుణ హత్యకు గురైంది.
సూలైమేడుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి(24) రోజూ మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లడానికి రైలు కోసం ఎదురుస్తుండగా ఒక వ్యక్తి గొడవపడ్డాడు. ఉన్నట్టుండి కత్తితీసి ఆమెను పొడిచి చంపాడు. ముఖం, మెడపై మీద తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది.