
రైల్వే స్టేషన్‌లో మహిళా టెకీ హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఒకరు చెన్నై నుంగంబక్కమ్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. సూలైమేడుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి(24) రోజూ మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లడానికి రైలు కోసం ఎదురుస్తుండగా ఒక వ్యక్తి గొడవపడ్డాడు. ఉన్నట్టుండి కత్తితీసి ఆమెను పొడిచి చంపాడు. ముఖం, మెడపై మీద తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. మరోవైపు.. కోయంబత్తూర్‌లో తన భర్తను హత్య చేసిన వ్యక్తిని సుకందామణి అనే మహిళ శుక్రవారం రాయితో మోది చంపేసింది.