సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పై అత్యాచార యత్నం
హైదరాబాద్: విధులు ముగించుకుని క్యాబ్‌లో వస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆల్వాల్ పీఎస్ పరిధిలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా.. అదే సమయంలో కారులో ఉన్న క్యాబ్ సూపర్‌వైజర్‌తోపాటు డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో ఇద్దరు నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆల్వాల్ పీఎస్‌కు తరలించారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపనున్నట్టు సమాచారం.