నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం | a man tryed to commit rape on a child | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

Published Thu, Mar 12 2015 11:56 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

a man tryed to commit rape on a child

హైదరాబాద్: కూతురు వరుసైన నాలుగేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు లైంగికదాడికి యత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం....మహబూబ్‌నగర్‌కు చెందిన భాస్కర్ (28) అల్వాల్‌లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మనస్పర్థలు రావడంతో భార్య ఇతడిని విడిచిపెట్టి కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, భాస్కర్ బుధవారం అన్నకూతురు వరుసయ్యే చిన్నారి (4)పై లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి ఏడవడంతో తల్లి గమనించి కేకలు వేయడంతో విషయం బయట పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు భాస్కర్‌ను అరెస్ట్  చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.
(అల్వాల్ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement