కంపెనీ వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ
పెందుర్రు(బంటుమిల్లి) : ఢిల్లీలో అదృశ్యమైన మండల పరిధిలోని పెందుర్రు గ్రామానికి చెందిన ప్రత్తి రవీం ద్రబాబు(35) వారం రోజుల అనంతరం ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శవమై కనిపించాడు. బంటుమిల్లి, ఒరిస్సా పోలీసుల సహకారంతో కుటుంబసభ్యులు రవీంద్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. పోలీ సులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ప్రత్తి వీరబాబు కుమారుడు రవీంద్రబాబు పదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిందట త న సమీప బంధువు నెలకొల్పిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ డివిజన్‌కు డెరైక్టర్‌గా చేరాడు. ఈ క్రమంలో గత నెల 22వ తేదీన స్వగ్రామం వచ్చిన రవి కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేశారంటూ హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళుతున్నానని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. కంపెనీ ప్రతినిధులతో కలసి ఢిల్లీ వెళ్లాడు.
దాదాపు 26వ తేదీ నుంచి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. జూన్ ఒక టో తేదీన వీరబాబు తన కుమారుడు కనిపించడంలేదంటూ బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభిం చారు. ఈనెల 2వ తేదీన భువనేశ్వర్ లాడ్జిలో దిగిన రవీంద్రబాబు రెండు రోజులు తలుపులు తీయకపోవడంతో అనుమానించి 4వ తేదీన అక్కడి న్యాయమూర్తి సమక్షంలో తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. రవీంద్రబాబు వద్ద ఉన్న అడ్రస్సు ఆధారంగా భువనేశ్వర్ పోలీసులు ఈనెల 5వ తేదీన బంటుమిల్లి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బంటుమిల్లి పోలీసులు, కుటుంబసభ్యులు భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు రవీంద్ర మృతదేహాన్ని వారికి అప్పగించారు. స్వగ్రామానికి చేరుకోగానే మృతుడి భార్య రేణుక, తల్లి రాజ్యలక్ష్మి స్పృహ కోల్పోయారు. మృతుడికి మూడేళ్ల కిందట దగ్గర బంధువు కాత్యాయని రేణుకతో వివాహం కాగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలే తన కుమారుడు ఆత్మహత్యకు ప్రేరేపించాయని మృతుడి తండ్రి వీరబాబు ఆరోపిస్తూ బుధవారం బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధు లు డబ్బుల కోసం తమతో అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. మానసిక వేదనకు గురిచేశారని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.