ravindra babu
-
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మరణ వార్త మరవకముందే టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మార్కాపురంలో పుట్టిన రవీంద్ర బాబు.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్ గా తన సేవలు అందిస్తూనే తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం తో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డు లు పొందారు . శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంతఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత గుర్తింపు పొందాడు. తెలుగు లో నే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలను నిర్మించారు. గీత రచయితగా కూడా తన ప్రతిభ చాటుకుంటూ హనీ ట్రాప్, సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ లాంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించాడు. ఇతనికి భార్య రమాదేవి, కుమార్తె ( ఆశ్రీత ) , ఒక కుమారుడు ( సాయి ప్రభాస్ ) ఉన్నారు. -
గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఆత్మీయంగా పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు, పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగిలుంటే వారికి పథకాలు అందేలా చూస్తారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 15న విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషినల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు జిల్లాల్లోని 430 గిరిజన గ్రామాల్లో నాలుగు ప్రత్యేక వాహనాల(ప్రభుత్వ పథకాల ప్రచార వ్యాన్)తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), జిల్లాల స్థాయిలో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు. గిరిజనుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇంకా అర్హత ఉన్న వాళ్లకు ఎవరికైనా రాకుంటే.. వారికి సంక్షేమ ఫలాలు అందించేలా తక్షణ చర్యలు చేపడతారు. గిరిజన జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులను చేరి్పంచడం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల అమలు, అర్హులకు వాటిని దరి చేర్చడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ‘జన జాతీయ గౌరవ్ దివస్’ను ఘనంగా జరుపుదాం సీఎం జగన్‌కు కేంద్ర మంత్రి లేఖ జన జాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నివాళి అర్పిస్తారని తెలిపారు. అలాగే బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం ఉలిహటు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశంలోని 75 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా..గిరిజన మ్యూజియం
సాక్షి, అమరావతి: గిరిజన స్వాతంత్య్ర వీరుల చరిత్రను భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి నింపే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన మ్యూజియం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రా కశ్మిర్‌గా పేరుగాంచిన లంబసింగికి సమీపంలో రూ.35 కోట్లతో ట్రైబల్ ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియం పనులు ఇప్పటికే 62.25 శాతానికి పైగా పూర్తయ్యాయి. గిరిజన పోరాటం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే అరకు, కర్నులు జిల్లా శ్రీశైలం, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మ్యూజియంలున్నాయి. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో గర్జించిన గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను నెలకొల్పనున్నారు. గిరిజన యోధుల చరిత్రను భావితరాలకు అందించేలా శిల్పాలు, ఫొటోలను ఏర్పాటు చేస్తారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చుని వీక్షించేలా డిజిటల్ థియేటర్‌ను నిరి్మస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజాలను నిర్మిస్తున్నారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీని నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. 2021లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగిలో 21.67ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేగంగా నిర్మాణ పనులు నాలుగు విభాగాలుగా చేపట్టిన మ్యూజియం నిర్మాణాన్ని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియంను మంజూరు చేసి రూ.15 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లతో పాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించడంతో మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – రవీంద్రబాబు, మిషన్ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు
సాక్షి, అమరావతి: గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ పేర్లను ఖరారు చేయగా.. అవే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమర్పించింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, జకియా ఖానమ్ ముస్లిం మైనారిటీ మహిళా నేత కావడం విశేషం. -
మాజీ జేడీ లక్ష్మీ నారాయణపై ఎంపీ రవీద్రబాబు ఫైర్
-
ఏపీలో అవినీతి తారస్థాయికి చేరింది
సాక్షి, హైదరాబాద్: ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఒకే ఒక్క సామాజిక వర్గానికి చంద్రబాబు సర్కార్ ఉపయోగపడుతోందని అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు మేలు జరగడం లేదన్నారు. విభజన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ఒక్క శాతం కూడా అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు లేకుండా వ్యక్తిగత అజెండాను పట్టుకొని అమరావతి, పోలవరం అంటూ గ్రాఫిక్స్‌ను సృష్టించి బస్టాండ్, ఎయిర్‌పోర్టుల్లో, ఆఖరికి ఢిల్లీలో కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన రవీంద్ర బాబు, ఆయన అనుచరులతో కలసి సోమవారం ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు. రవీంద్రబాబుకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఇటీవలే టీడీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా సాధ్యం ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక మగధీరుడు వైఎస్ జగన్ అని రవీంద్ర బాబు కొనియాడారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే కేంద్రం దిగి వచ్చి ఏపీకి రావాల్సిన హోదా సహా మిగతా హామీలన్నీ నెర వేరుతాయని జగన్ చెప్పినా సీఎం చంద్రబాబు పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి దీక్ష చేస్తే దాన్ని చంద్రబాబు హాస్యాస్పదంగా చిత్రీకరించారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా, దళితుల సంక్షేమం జగన్ వల్లే సాధ్యమని నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రవీంద్ర బాబు తెలిపారు. దాదాపు రూ. 3 వందల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌లో భవనాలకు మరమ్మతులు చేయించుకున్న చంద్రబాబు.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదులుకొని ఏడాదిలోపే అమరావతికి పారిపోయి వచ్చారని మండిపడ్డారు. పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడినా, తన నియోజకవర్గానికి రైల్వేలైన్‌తో పాటు రూ. 100 కోట్ల నిధులు సాధించి పనులు చేయించినా దళితుడిననే ఒకే ఒక్క కారణంతో తన పేరు కూడా పేపర్లలో రాయకుండా చేశారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని, ప్యాకేజీని మగ పిల్లాడితో పోల్చి ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని చెప్పారు. హోదాను తుంగలో తొక్కి చివరికి ప్యాకేజీని కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగున్నరేళ్లు సంసారం చేసి.. తరువాత వ్యభిచారం అని తెగదెంపులు చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుంటుపడిందని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రవీంద్రబాబు. చిత్రంలో అవంతి, విజయసాయిరెడ్డి తదితరులు ప్రజలను మభ్యపెట్టే యత్నం జగన్‌కు జనాల్లో ఆదరణ పెరిగిపోతుండడంతో నల్ల చొక్కా వేసుకొని తాము చేసిందే సబబు అనేలా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఒడిలో కూర్చొని నవ నిర్మాణ దీక్ష, కాంగ్రెస్ ఒడిలో కూర్చొని ధర్మపోరాట దీక్ష అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏపీకి చేసిన అన్యాయం అందరికీ తెలుసని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పోటీ చేసిన చంద్రబాబుకు భంగపాటు ఎదురైందని గుర్తు చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి సరిపడే ముఖ్యమంత్రి కాదని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. ఏపీకి కావాల్సినవన్నీ వస్తాయని, కాంగ్రెస్, బీజేపీ సహా 23 పార్టీల మెడలు వంచానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. బాబు చెప్పే అబద్ధాలను నమ్మడం వల్లే జగన్‌తో కలిసి నడవడం ఆలస్యమైందని చెప్పారు. ఏపీకి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారన్నారు. అదే బాటలో పయనించాలని జగన్ పోరాడుతున్నారని, దళితులు, బీసీలు, మైనార్టీల గురించి జగన్ ప్రసంగాలు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి మోక్షం కలగాలన్నా, పేదరికం పోవాలన్నా జగన్ అధికారంలోకి రావాలన్నారు. నాడు అంబేడ్కర్ చెప్పినవే ఇప్పుడు జగన్ చెబుతున్నారని, ఆయన వల్లే అందరికీ మేలు జరుగుతుందని రవీంద్రబాబు అభిప్రాయపడ్డారు. బాబు కుటిల నీతి తెలుసు చంద్రబాబు కుటిల నీతి తనకు తెలుసని, ఏ వర్గం వారు విమర్శిస్తే.. అదే వర్గం వారితో తిరిగి తిట్టించడం బాబు ఆనవాయితీ అని రవీంద్రబాబు చెప్పారు. బాబు మాటలు నమ్మి దళిత సోదరులు తనపై విమర్శల దాడి చేయవద్దని సలహా ఇచ్చారు. తన మనస్సాక్షి అంగీకరించకే తెలుగుదేశం పార్టీని వీడినట్టు వివరించారు. -
అంతర్యుద్ధం వచ్చినా రావొచ్చు : రవీంద్ర బాబు
సాక్షి, ఢిల్లీ : ప్రత్యేక హోదా అంశంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి తాము బయటికి వచ్చినందునే రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పగబట్టారన్నారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను చిన్న చూపు చూస్తూ మోదీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రధాని ఇంటిని ముట్టడించినా ఫలితం లేదని ఎంపీ రవీంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దేశాన్ని విచ్చిన్నం చేయడం ద్వారా దక్షిణ భారత దేశాన్ని వేరు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్ర అనుచిత వైఖరి పట్ల యువత రగిలిపోతోందని, అంతర్యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కేజీ బేసిన్తోనే ఆదాయం.. రాష్ట్రంలో కేంద్రీకృతమైన కేజీ బేసిన్ వల్లే గ్యాస్, చమురు దిగుమతులు తగ్గాయని, ఈ కారణంగానే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్‌లోని క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేయడానికి కాకినాడ ప్రాంతంలోనే పెట్రో కెమికల్ కాంప్లెక్ కడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రత్నగిరికి మార్చడం అన్యాయమన్నారు. గ్యాస్ కోసం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఓఎన్జీసీ అద్దె కొంపలో ఉంటోందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి, ఈస్టిండియా కంపెనీకి తేడా లేదని మండిపడ్డారు. తక్షణమే ఎల్ అండ్ జీ టెర్మినల్ నిర్మించాలని, రత్నగిరి నుంచి పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను కాకినాడకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ అంశమై త్వరలోనే పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ అవుతానని రవీంద్ర బాబు తెలిపారు. -
మున్సిపల్ ఆర్డీగా రవీంద్రబాబు
అనంతపురం న్యూసిటీ : కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు మున్సిపల్ ఆర్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవేన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో పీవీవీఎస్ మూర్తి(ఎఫ్ఏసీ)గా ఉన్న విషయం విదితమే. మరో మూడు రోజుల్లో ఆర్డీగా రవీంద్రబాబు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ఆర్డీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీలో అదృశ్యం.. భువనేశ్వర్‌లో ఆత్మహత్య
కంపెనీ వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ పెందుర్రు(బంటుమిల్లి) : ఢిల్లీలో అదృశ్యమైన మండల పరిధిలోని పెందుర్రు గ్రామానికి చెందిన ప్రత్తి రవీం ద్రబాబు(35) వారం రోజుల అనంతరం ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శవమై కనిపించాడు. బంటుమిల్లి, ఒరిస్సా పోలీసుల సహకారంతో కుటుంబసభ్యులు రవీంద్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. పోలీ సులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ప్రత్తి వీరబాబు కుమారుడు రవీంద్రబాబు పదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిందట త న సమీప బంధువు నెలకొల్పిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ డివిజన్‌కు డెరైక్టర్‌గా చేరాడు. ఈ క్రమంలో గత నెల 22వ తేదీన స్వగ్రామం వచ్చిన రవి కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేశారంటూ హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళుతున్నానని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. కంపెనీ ప్రతినిధులతో కలసి ఢిల్లీ వెళ్లాడు. దాదాపు 26వ తేదీ నుంచి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. జూన్ ఒక టో తేదీన వీరబాబు తన కుమారుడు కనిపించడంలేదంటూ బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభిం చారు. ఈనెల 2వ తేదీన భువనేశ్వర్ లాడ్జిలో దిగిన రవీంద్రబాబు రెండు రోజులు తలుపులు తీయకపోవడంతో అనుమానించి 4వ తేదీన అక్కడి న్యాయమూర్తి సమక్షంలో తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. రవీంద్రబాబు వద్ద ఉన్న అడ్రస్సు ఆధారంగా భువనేశ్వర్ పోలీసులు ఈనెల 5వ తేదీన బంటుమిల్లి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బంటుమిల్లి పోలీసులు, కుటుంబసభ్యులు భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు రవీంద్ర మృతదేహాన్ని వారికి అప్పగించారు. స్వగ్రామానికి చేరుకోగానే మృతుడి భార్య రేణుక, తల్లి రాజ్యలక్ష్మి స్పృహ కోల్పోయారు. మృతుడికి మూడేళ్ల కిందట దగ్గర బంధువు కాత్యాయని రేణుకతో వివాహం కాగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలే తన కుమారుడు ఆత్మహత్యకు ప్రేరేపించాయని మృతుడి తండ్రి వీరబాబు ఆరోపిస్తూ బుధవారం బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధు లు డబ్బుల కోసం తమతో అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. మానసిక వేదనకు గురిచేశారని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
రవీంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం
సఖినేటిపల్లి : ప్రొటోకాల్‌ను విస్మరించి, తెలుగుదేశం క్యాడర్ లేకుండానే అమలాపురం ఎంపీ పండుల రవీం ద్రబాబు పర్యటిస్తున్నారని రాజోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. దీనిపై హైకమాం డ్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం అంతర్వేదిపాలెంలో సమావేశమైన నాయకులు ఎంపీ వైఖరిని ఎండగట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్యకర్తలను ఎంపీ రవీంద్రబాబు కలుపుకొని వెళ్లడంలేదన్నారు. పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా, ఇతర పార్టీల నాయకులతో కలసి ఎంపీ పర్యటిస్తున్నారని మండిపడ్డారు. దళితులు మధ్య విభేదాలకు తావిచ్చేలా ఎంపీ వ్యవహారశైలి ఉందన్నారు. ఎంపీ ఇదే పంథాలో నడిస్తే ఊరుకోబోమని అల్టిమేటం ఇచ్చారు. గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు నీటి సంఘ చైర్మన్ ఓగూరి విజయ్‌కుమార్, రాజోలు ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, వైస్ చైర్మన్ రహీం, డెరైక్టర్ కడలి నాగేశ్వరరావు, సఖినేటిపల్లి సర్పంచ్ రావి ధర్మరాజు, వైస్ ఎంపీపీ బత్తుల రవీంద్రనాథ్, మాజీ ఎంపీపీ నల్లి సుధీర్, పార్టీ మండల శాఖ అద్యక్షుడు యెనుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ వ్యాఖ్యలపై విరుచుకుపడిన మాజీ సైనికులు
తూర్పుగోదావరి(కాకినాడ): 'ఫ్రీ ఫుడ్...ఫ్రీ డ్రింక్... ఫ్రీ హాలిడేస్...' అంటూ జవాన్లను కించపరిచేలా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఒక జాతీయ చానల్ చర్చావేదికలో చేసిన వ్యాఖ్యల పై మాజీ సైనిక ఉద్యోగులు ఫైర్ అయ్యారు. సైనికులకు రవీంద్రబాబు క్షమాపణ చెప్పి ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సైనికుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రవీంద్ర బాబును టీడీవీ వెంటనే సస్పెండ్ చెయాలన్నారు. పార్లమెంటుపై ముష్కరులు దాడి చేసినప్పుడు ఆర్మీ లేకపోతే ఎంపీల పరిస్థితి ఎంటో రవీంద్రబాబు ఆలోచించాలని మాజీ సైనికోద్యోగులు తెలిపారు. -
సైన్యంపై చెత్తవాగుడు వాగిన టీడీపీ ఎంపీ
-
ఏజ్ ఫ్యాకడ్.. 50’s లో సిక్స్ పలకలు
నాల్గుపదుల వయసొచ్చి నెత్తి మీద జుట్టు కాస్త పలచబడి.. మరి కాస్త తెల్లబడితే.. ‘హు.. ముప్పాతిక జీవితం ఫినిష్’ అని వేదాంతం మొదలెడతారు. కాస్త కీళ్ల నొప్పులు మొదలైతే.. విశ్రాంతి కోరుకుంటారు. ఫార్టీ ప్లస్‌లో షారూఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్స్ అంటే అబ్బో అంటాం.. లేటెస్ట్గా 8 ఫ్యాక్స్ తీశాడంటే.. పోనిద్దూ అతను సినిమా స్టారూ.. మన దా ఏజ్ బార్ అయిందంటూ దీర్ఘాలు తీస్తాం. వీరికి డయాబెటిస్, బీపీ కూడా తోడయ్యాయనుకోండి.. మందుల చిట్టీలు మెడకు చుట్టుకుని డయాగ్నస్టిక్ సెంటర్లు.. క్లినిక్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గడిపేస్తారు. అలాంటి వారికి రవీంద్రబాబు లైఫ్ ఓ లెసన్. ఏజ్ యాభైకి చేరుతున్నా.. యంగ్‌స్టర్స్‌కి సైతం జెలసీ పుట్టించేంత ఫిట్‌గా మారారు. రెండేళ్ల కిందటి వరకు ఒబేసిటీ, డయాబెటిస్, బీపీలతో సావాసం చేసిన ఈయన ఇప్పుడు ఆరు పలకల శరీరంతో సాహసగాడని ప్రూవ్ చేసుకున్నారు. ‘ఎత్తు 5.7. బరువు 112 కిలోలు. నాలుగేళ్లుగా హై డయాబెటిస్, 7-8 ఏళ్లుగా హైపర్‌టెన్షన్’ ఈ రకమైన కేస్ షీట్ ఉన్న వ్యక్తి మీరైతే ఎలా ఉంటుంది? ‘‘చాలా చిరాకుగా ఉండేది. డాక్టర్లు, మందులు ఇదే పని. లోపల ఏదో జరగుతోందని తెలుస్తుండేది. బరువు కారణంగా పెద్ద పొట్ట, రఫ్‌గా ఉండేవాడ్ని. సిక్‌గా, ముఖం నల్లగా మాడిపోయినట్టుండేది. డ్రెస్‌లూ కొనాలనిపించేది కాదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో నలుగురిలో ఎంజాయ్ చేయలే కపోయేవాడ్ని. కొవ్వును కోసేయాలన్నంత కోపం వచ్చేది’ అంటూ గుర్తు చేసుకున్నారు రాజ్‌భవన్ రోడ్ నివాసి రవీంద్రబాబు. హైకోర్ట్‌లో అడ్వొకేట్‌గా పనిచేస్తున్న ఈయన...‘వ్యాయామం చేయమని డాక్టర్లు చాలాసార్లు చెప్పారు. ఏజ్ఫ్యాక్టర్, ప్రొఫెషనల్ ప్రెషర్స్, సరైన టైమింగ్స్ లేకపోవడం... వీటి కారణంగా సీరియస్‌గా దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అని చెప్పారు. ఈ సమస్యను భరించలేక చివరికి బేరియాట్రిక్ సర్జరీకి కూడా సిద్ధమయ్యారాయన. అయితే విదేశాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్న సోదరుడు రాజ్‌గోపాల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవారికి అది ప్రమాదకరం కాగలదని హెచ్చరించడంతో ఆ ఆలోచన మానుకున్నారు. కదిలించిన‘సన్’స్ట్రోక్... రోగాలకూ, చికాకులకూ వ్యక్తిగత ఇబ్బందులకూ కదలని రవీంద్రబాబు.. తండ్రిగా మాత్రం కదలకుండా ఉండలేకపోయారు. తనలాగే ఒబెసిటీతో బాధపడుతున్న కొడుకు సమస్య పరిష్కారం కోసం జిమ్‌లో జాయిన్ చేయాలనుకున్నారు. ‘రెండున్నరేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని యాడ్లైఫ్లో మా అబ్బాయిని జాయిన్ చేశాను. అక్కడి యాంబియన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యా. తర్వాత నేనూ జాయినయ్యా. అంతే నా లైఫ్‌స్టైల్ మారిపోయింది. వైట్‌రైస్‌తో పాటు అన్ని రకాల రైస్ మానేశాను. బ్యాడ్ హ్యాబిట్స్, పార్టీలు, అర్ధరాత్రులు దాటాక పడుకోవడం మానేశా. ఏడాదిలో 12 కిలోలు తగ్గాను’ అంటూ వివరించారు. సెకండియర్.. సిక్సర్ దాదాపు 15కిలోలు తగ్గగానే క్లోజ్ సర్కిల్లో వస్తున్న గుర్తింపు, ప్రశంసలు రవీంద్రబాబును మరింత మోటివేట్ చేశాయి. రెండో ఏడాది వర్కవుట్ టైమ్ గంట నుంచి 2గంటలకు పెంచారు. నేను సిక్స్‌ప్యాక్ సాధించిన క్రెడిట్ ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్‌దే. దాదాపు 20 కిలోల వెయిట్ తగ్గాను. నాలుగు నెలలు ప్రతి రోజూ నాలుగు గంటలు వర్కవుట్స్ చేశాను. హై ప్రొటీన్డైట్, తక్కువ కార్బొహైడ్రేట్స్... చపాతీలు సైతం మార్చేసి ఓట్స్ ఇలా మార్చుకుంటూ స్పీడ్ పెంచారు. దాంతో వెయిట్ తగ్గడం అనేది అలవాటైపోయింది. రెగ్యులర్ వర్కవుట్స్‌తో ఇక డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లకు మందుల అవసరం తగ్గిపోయింది. ‘నేను సిక్స్‌ప్యాక్ సాధించిన క్రెడిట్ ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్‌దే’అంటారు రవీంద్రబాబు. దాదాపు 20కిలోల వెయిట్ తగ్గాక తాను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని నిజం చేద్దామంటూ ఆర్గనైజ్డ్ వర్కవుట్‌తో అనూహ్యమైన షేప్‌ను సాకారం చేశాడంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ‘‘సిక్స్‌ప్యాక్ అన్నప్పుడు నా శ్రీమతి ఆందోళన చెందింది. ఫిట్‌గా ఉన్నారు చాలు కదా అంత కష్టం అవసరమా అంది. అయితే వెంకట్ ప్రోత్సాహంతో 4 నెలల పాటు రోజుకు 4గంటల చొప్పున వర్కవుట్స్ చేశాను. సాధించాను. అప్పట్లో స్టమక్ సైజ్ 44దాకా ఉండేది. ఇప్పుడు 32-34 మధ్యలో ఉంటుంది. బరువు 72 కిలోలకు చేరింది. ఫిట్నెస్ విషయంలో డైటింగ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అలాగే సరైన ట్రైనర్ కూడా ముఖ్యమే. ప్రారంభంలో నాకున్న హెల్త్ ప్రాబ్లెమ్స్ వల్ల... పెయిన్స్, అనీజీనెస్ వచ్చేది. అయితే వెంకట్ అనుక్షణం నాకు టచ్‌లో ఉండేవాడు. ప్రతి దానికీ తన దగ్గర ఆన్సర్ ఉండేది’’ అంటూ తన ట్రైనర్‌కు థ్యాంక్స్ చెబుతారు. ఒబెసిటీ టు సెలబ్రిటీ... ‘ప్రస్తుతం పూర్తిగా డయాబెటిస్ మందులు మానేశాను. బీపీ డోస్ కూడా తగ్గించేశా. నా సర్కిల్లో నేనిప్పుడు సెలిబ్రిటీగా మారిపోయాను’ అంటారు ఆనందంగా రవీంద్రబాబు. ముఖ్యంగా తన ఏజ్ గ్రూప్‌లో ఇంత ఫిట్‌గా ఉండడం తనకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని, ప్రస్తుతం లైప్ కూడా చాలా బావుందంటూ థ్యాంక్స్ టూ వర్కవుట్స్ అంటున్నారు. ఏజ్‌తో సమస్య లేదు... లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు వంటివి ఖరీదైనవి అలాగే వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా సరే వీలైనంత వరకూ వెయిట్లాస్కు నాచురల్ పద్ధతుల్లో ప్రయత్నించడమే బెటర్. గత కొంతకాలంగా విభిన్న వయసుల వారు అదీ హెవీ వెయిట్ ఉన్నవారి చేత సిక్స్‌ప్యాక్ చేయించగలిగాను. శరీరాన్ని చక్కగా మార్చుకోవాలనే సంకల్పం కష్టించే తత్వం ఉండాలే కాని ఏ ఏజ్ వారైనా సరే బరువు తగ్గించుకోవడం మాత్రమే కాదు సిక్స్, ఎయిట్ ప్యాక్‌లు సాధించడమూ సాధ్యమే. అందుకు రవీంద్రబాబు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. -ఎం. వెంకట్, ఫిట్నెస్ ట్రైనర్ - ఎస్.సత్యబాబు -
‘కోనసీమకు రైల్వేలైన్ సాధిసా’్త
అమలాపురం, న్యూస్‌లైన్: కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ సాధిస్తానని అమలాపురం ఎంపీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్ల సత్యనారాయణరావు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై రైల్వేబోర్డు సభ్యులు, చీఫ్ ఇంజనీర్లతో చర్చించానన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను కాకినాడ-పిఠాపురం మీదుగా మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేస్తేనే ఉపయోగం ఉంటుందని రైల్వే అధికారులు చెప్పారన్నారు. ఈ లైన్‌పై కోటిపల్లి, బోడసకుర్రు, నర్సాపురం గోదావరిలపై 150 మైనర్ వంతెనలు, 50 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందని రైల్వేబోర్డు అధికారులు ప్రతిపాదనలు చేశారన్నారు. దీనికి అవసరమైన భూసేకరణ, సాయిల్ టెస్ట్ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారన్నారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం అంశం ప్రధానమంత్రి నరేంద్రమోడి దృష్టికి తీసుకెళ్లానని, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వేమంత్రి సదానందగౌడ్‌లతో చర్చించి రైల్వేబడ్జెట్‌లో నిధులు సాధించి అమలాపురానికి రైలు తీసుకొస్తానని ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. కోనసీమలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక సిద్ధం చేశానన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వ అధికారులు, ఓఎన్జీసీ, చమురు సంస్థలతో చర్చించానన్నారు. కోనసీమలో సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జీఎస్పీసీ సంస్థ మత్స్యకారులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించలేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మెట్ల సత్యనారాయణరావు మాట్లాడుతూ కోనసీమను ప్రత్యేక జిల్లా చేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ రవీంద్రబాబు రైల్వేలైన్ సాధించగలరన్న ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ విజేత అధికారి జయవెంకటలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యాళ్ల మల్లేశ్వరరావు, టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, అల్లాడి స్వామినాయుడు, తిక్కిరెడ్డి నేతాజీ, చిక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం!
వాంతులు చేసుకున్న విద్యార్థులు కంపు కొట్టిన సాంబారు అన్నం బయట పారబోత చోడవరం రూరల్, న్యూస్‌లైన్: గోవాడ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఆదివారం మధ్యాహ్న భోజనం చేసిన కొందరు విద్యార్థులకు వాంతులకు గురయ్యారు. మరికొందరు అన్నం బయట పారబోశారు. ఇది తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సాంబారు బాగోలేక వాంతులు అయ్యాయని, అందుకే భోజనాలను పారబోశామని విద్యార్థులు తెలిపారు. ఈ ఉన్నత పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ మాదిరి ఆదివారం మధ్యాహ్నభోజనం తిన్న కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మళ్ల సాయి, ఎస్. శ్యామల, తదితరులు కొద్ది సేపు అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. కొందరు భోజనం మానేశారు. మరి కొందరు పళ్లాల్లోని అన్నాన్ని బయట పారబోశారు. ఇది తెలిసిన గ్రామస్తులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్నారు. వెంటనే మండల విద్యాశాఖాధికారి(ఎంఈఓ)కి ఫిర్యాదు చేశారు. ఆయన ఎకాయెకిన పాఠశాలకు చేరుకుని వంటలను పరిశీలించారు. వంట షెడ్డు లేకపోవడంతో ఆరుబయట వంటలు చేస్తున్నారు. దీనికి తోడు సమీపంలోనే విద్యార్థుల మరుగుదొడ్లు ఉన్నాయి. వాటిని శుభ్రపరిచిన దాఖలాలు కనిపించడం లేదు. కాగా సాంబారులో వినియోగించిన టమాటా, ఇతర కూరల వల్ల రుచి పాడయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం మిగిలిన పప్పును సాంబారులో ఆదివారం వినియోగించారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతోపాటు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. తాము పాత్రలను శుభ్రం చేసి వండుతున్నామని, పైన చెట్ల నుంచి ఏదైనా పడి ఉండవచ్చని నిర్వాహకులు అంటున్నారు. మాజీ సర్పంచ్ ఏడువాక లక్ష్మణకుమార్, ఏడువాక సింహాచలం ఆధ్వర్యంలో పలువురు తల్లిదండ్రులు, యువకులు ఈ విషయమై హెచ్ఎం, ఎంఈవోలను నిలదీశారు. సెలవులో ఉన్నందున తాను ఈ రోజు వంటలను పరిశీలించలేదని హెచ్ఎం రవీంద్రబాబు తెలిపారు. మళ్లీ వండి మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థులకు భోజనం పెట్టారు. -
సమ్మెతో యూపీఏ కళ్లు తెరిపిస్తాం
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో రాష్ట్ర విభజనబిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెతో యూపీఏ ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు అన్నారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ భవన్లో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత ఉద్యోగులు సుశిక్షిత సైనికుల వలే కంకణ బద్ధులై సమైక్యపోరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రుల సత్తా ఇప్పటికే కేంద్రం రుచి చూసిందని, ఈ దఫా సమ్మెతో యూపీఏ సర్కారు దిగిరాక తప్పదన్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఎన్జీఓ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే మహాప్రదర్శనకు అన్ని శాఖల ఉద్యోగులు తరలిరావాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలను మూయిస్తామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్ కుమార్ చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, చిత్తశుద్ధితో తెలంగాణా బిల్లును అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో రమణారెడ్డి, శేకర్రావు, మధుసూధన్‌రావు, సతీష్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె బాట
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ చొప్పా రవీంద్రబాబు తెలిపారు. స్థానిక ఎన్జీఓ భవన్లో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం, ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారని తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో నుంచి ఏసీస్టేడియం వరకు సమైక్య రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, సమైక్యవాదులు సమైక్యరన్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 17, 18 తేదీల్లో చలో పార్లమెంటు కార్యక్రమానికి జిల్లా ప్రజలు 15వ తేదీ నుంచే ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మెకాలాన్ని క్రమబద్ధీకరించి ఆర్జిత సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీఓ 33 విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య ఉద్యోగుల మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కరుణమ్మ సేవలు గుర్తించి రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ కన్వీనర్‌గా నియమించినందుకు ఆమెను అభినందించారు. ఈ సమావేశంలో రమణారెడ్డి, జోషి, సుధాకరరావు, ప్రభాకర్‌రెడ్డి, శివకుమార్, హైమావతి, శ్రీకాంతరావు, శ్రీనివాసులురెడ్డి, రవికుమార్, శేఖర్‌రావు, సతీష్‌బాబు, శైలజ పాల్గొన్నారు. నేటి అర్ధరాత్రి నుంచి వీఆర్ఓల సమ్మె నెల్లూరురూరల్ : సమైక్య రాష్ట్ర సాధన కోసం బుధవారం అర్ధరాత్రి నుంచి వీఆర్ఓలు సమ్మెలో పాల్గొంటున్నట్లు వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆంధ్రరాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆంధ్రులను అవమానిస్తున్న సోనియా
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: కొందరు స్వార్థపూరిత శక్తుల మాయమాటల్లో పడి సోనియాగాంధీ ఆంధ్రులను అవమానిస్తోందని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆదివారం దర్గామిట్టలోని ఎన్జీఓభవన్ నుంచి డీఎస్ఆర్ ఆసుపత్రి సమీపంలో ఉన్న రాజీవ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లజెండాలు చేతబూని కేంద్ర ప్రభుత్వానికి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సోనియా మనసు మార్చేందుకు ప్రయత్నించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం సోనియా, యూపీఏ ప్రభుత్వం, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ అన్నదమ్ములవలె కలసి ఉన్న ఆంధ్రులను విడగొట్టి, అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించి సోనియా ఏ విధమైన ప్రయోజనాలను ఆశిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. విభజనతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సమాధికట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సిరాజ్, మునిరెడ్డి, వెంకటకృష్ణయ్య, సుధీర్‌రెడ్డి, శర్మ, మాలకొండయ్య, నాగరాజు, మాధవయ్య, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, కొండారెడ్డి, మునెయ్య, పెంచలయ్య, విజయ్‌కుమార్, గోపినాథ్‌రెడ్డి, ధర్మేంద్ర, గిరిబాబు, మస్తానయ్య, దేవకుమార్, నర్సారెడ్డి, నరసింహులు, రామయ్య, శేషయ్య, రాజమోహన్‌రెడ్డి, ఖాజా, జావిద్, కృష్ణయ్య, తిరుపతయ్య, శేఖర్‌రావు, సతీష్‌బాబు, హైమావతి, సుధాకర్‌రావు, రమణారెడ్డి, వెంకమరాజు, శివకుమార్ పాల్గొన్నారు.