ప్రముఖ నటుడు చంద్రమోహన్ మరణ వార్త మరవకముందే టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మార్కాపురంలో పుట్టిన రవీంద్ర బాబు.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్ గా తన సేవలు అందిస్తూనే తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం తో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డు లు పొందారు .
శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంతఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత గుర్తింపు పొందాడు. తెలుగు లో నే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలను నిర్మించారు.
గీత రచయితగా కూడా తన ప్రతిభ చాటుకుంటూ హనీ ట్రాప్, సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ లాంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించాడు. ఇతనికి భార్య రమాదేవి, కుమార్తె ( ఆశ్రీత ) , ఒక కుమారుడు ( సాయి ప్రభాస్ ) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment