నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: కొందరు స్వార్థపూరిత శక్తుల మాయమాటల్లో పడి సోనియాగాంధీ ఆంధ్రులను అవమానిస్తోందని ఏపీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆదివారం దర్గామిట్టలోని ఎన్‌జీఓభవన్ నుంచి డీఎస్‌ఆర్ ఆసుపత్రి సమీపంలో ఉన్న రాజీవ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లజెండాలు చేతబూని కేంద్ర ప్రభుత్వానికి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సోనియా మనసు మార్చేందుకు ప్రయత్నించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం సోనియా, యూపీఏ ప్రభుత్వం, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ అన్నదమ్ములవలె కలసి ఉన్న ఆంధ్రులను విడగొట్టి, అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించి సోనియా ఏ విధమైన ప్రయోజనాలను ఆశిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. విభజనతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సమాధికట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సిరాజ్, మునిరెడ్డి, వెంకటకృష్ణయ్య, సుధీర్‌రెడ్డి, శర్మ, మాలకొండయ్య, నాగరాజు, మాధవయ్య, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, కొండారెడ్డి, మునెయ్య, పెంచలయ్య, విజయ్‌కుమార్, గోపినాథ్‌రెడ్డి, ధర్మేంద్ర, గిరిబాబు, మస్తానయ్య, దేవకుమార్, నర్సారెడ్డి, నరసింహులు, రామయ్య, శేషయ్య, రాజమోహన్‌రెడ్డి, ఖాజా, జావిద్, కృష్ణయ్య, తిరుపతయ్య, శేఖర్‌రావు, సతీష్‌బాబు, హైమావతి, సుధాకర్‌రావు, రమణారెడ్డి, వెంకమరాజు, శివకుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రులను అవమానిస్తున్న సోనియా
Published Mon, Dec 16 2013 7:12 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement