ప్రొటోకాల్‌ను విస్మరించి, తెలుగుదేశం క్యాడర్ లేకుండానే అమలాపురం ఎంపీ పండుల రవీం ద్రబాబు పర్యటిస్తున్నారని రాజోలు నియోజకవర్గ
సఖినేటిపల్లి : ప్రొటోకాల్‌ను విస్మరించి, తెలుగుదేశం క్యాడర్ లేకుండానే అమలాపురం ఎంపీ పండుల రవీం ద్రబాబు పర్యటిస్తున్నారని రాజోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. దీనిపై హైకమాం డ్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం అంతర్వేదిపాలెంలో సమావేశమైన నాయకులు ఎంపీ వైఖరిని ఎండగట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్యకర్తలను ఎంపీ రవీంద్రబాబు కలుపుకొని వెళ్లడంలేదన్నారు.
పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా, ఇతర పార్టీల నాయకులతో కలసి ఎంపీ పర్యటిస్తున్నారని మండిపడ్డారు. దళితులు మధ్య విభేదాలకు తావిచ్చేలా ఎంపీ వ్యవహారశైలి ఉందన్నారు. ఎంపీ ఇదే పంథాలో నడిస్తే ఊరుకోబోమని అల్టిమేటం ఇచ్చారు. గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు నీటి సంఘ చైర్మన్ ఓగూరి విజయ్‌కుమార్, రాజోలు ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, వైస్ చైర్మన్ రహీం, డెరైక్టర్ కడలి నాగేశ్వరరావు, సఖినేటిపల్లి సర్పంచ్ రావి ధర్మరాజు, వైస్ ఎంపీపీ బత్తుల రవీంద్రనాథ్, మాజీ ఎంపీపీ నల్లి సుధీర్, పార్టీ మండల శాఖ అద్యక్షుడు యెనుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.