నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనబిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెతో యూపీఏ ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు
అన్నారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ భవన్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత ఉద్యోగులు సుశిక్షిత సైనికుల వలే కంకణ బద్ధులై సమైక్యపోరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రుల సత్తా ఇప్పటికే కేంద్రం రుచి చూసిందని, ఈ దఫా సమ్మెతో యూపీఏ సర్కారు దిగిరాక తప్పదన్నారు.
గురువారం ఉదయం 11.30 గంటలకు ఎన్జీఓ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే మహాప్రదర్శనకు అన్ని శాఖల ఉద్యోగులు తరలిరావాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలను మూయిస్తామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్ కుమార్ చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, చిత్తశుద్ధితో తెలంగాణా బిల్లును అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో రమణారెడ్డి, శేకర్‌రావు, మధుసూధన్‌రావు, సతీష్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.