ఏజ్ ఫ్యాకడ్.. 50’s లో సిక్స్ పలకలు | Can be made good Body fitness in age of 50 | Sakshi
Sakshi News home page

ఏజ్ ఫ్యాకడ్.. 50’s లో సిక్స్ పలకలు

Published Thu, Sep 18 2014 12:18 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

ఏజ్ ఫ్యాకడ్.. 50’s లో సిక్స్ పలకలు - Sakshi

ఏజ్ ఫ్యాకడ్.. 50’s లో సిక్స్ పలకలు

నాల్గుపదుల వయసొచ్చి నెత్తి మీద జుట్టు కాస్త పలచబడి.. మరి కాస్త తెల్లబడితే.. ‘హు.. ముప్పాతిక జీవితం ఫినిష్’ అని వేదాంతం మొదలెడతారు. కాస్త కీళ్ల నొప్పులు మొదలైతే.. విశ్రాంతి కోరుకుంటారు. ఫార్టీ ప్లస్‌లో షారూఖ్  ఖాన్ సిక్స్ ప్యాక్స్ అంటే అబ్బో అంటాం.. లేటెస్ట్‌గా 8 ఫ్యాక్స్ తీశాడంటే.. పోనిద్దూ అతను సినిమా స్టారూ.. మన దా ఏజ్ బార్ అయిందంటూ దీర్ఘాలు తీస్తాం. వీరికి డయాబెటిస్, బీపీ కూడా తోడయ్యాయనుకోండి.. మందుల చిట్టీలు మెడకు చుట్టుకుని డయాగ్నస్టిక్ సెంటర్లు.. క్లినిక్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గడిపేస్తారు. అలాంటి వారికి రవీంద్రబాబు లైఫ్ ఓ లెసన్. ఏజ్ యాభైకి చేరుతున్నా.. యంగ్‌స్టర్స్‌కి సైతం జెలసీ పుట్టించేంత ఫిట్‌గా మారారు. రెండేళ్ల కిందటి వరకు ఒబేసిటీ, డయాబెటిస్, బీపీలతో సావాసం చేసిన ఈయన ఇప్పుడు ఆరు పలకల శరీరంతో సాహసగాడని ప్రూవ్ చేసుకున్నారు.
 
 ‘ఎత్తు 5.7. బరువు 112 కిలోలు. నాలుగేళ్లుగా హై డయాబెటిస్, 7-8 ఏళ్లుగా హైపర్‌టెన్షన్’ ఈ రకమైన కేస్ షీట్ ఉన్న వ్యక్తి మీరైతే ఎలా ఉంటుంది? ‘‘చాలా చిరాకుగా ఉండేది. డాక్టర్లు, మందులు ఇదే పని. లోపల ఏదో జరగుతోందని తెలుస్తుండేది. బరువు కారణంగా పెద్ద పొట్ట, రఫ్‌గా ఉండేవాడ్ని. సిక్‌గా,  ముఖం నల్లగా మాడిపోయినట్టుండేది. డ్రెస్‌లూ కొనాలనిపించేది కాదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో నలుగురిలో ఎంజాయ్ చేయలే కపోయేవాడ్ని. కొవ్వును కోసేయాలన్నంత కోపం వచ్చేది’ అంటూ గుర్తు చేసుకున్నారు రాజ్‌భవన్ రోడ్ నివాసి రవీంద్రబాబు. హైకోర్ట్‌లో అడ్వొకేట్‌గా పనిచేస్తున్న ఈయన...‘వ్యాయామం చేయమని డాక్టర్లు చాలాసార్లు చెప్పారు. ఏజ్‌ఫ్యాక్టర్, ప్రొఫెషనల్ ప్రెషర్స్, సరైన టైమింగ్స్ లేకపోవడం... వీటి కారణంగా సీరియస్‌గా దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అని చెప్పారు.  ఈ సమస్యను భరించలేక చివరికి బేరియాట్రిక్ సర్జరీకి కూడా సిద్ధమయ్యారాయన. అయితే విదేశాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్న సోదరుడు రాజ్‌గోపాల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవారికి అది ప్రమాదకరం కాగలదని హెచ్చరించడంతో ఆ ఆలోచన మానుకున్నారు.
 
 కదిలించిన‘సన్’స్ట్రోక్...
 రోగాలకూ, చికాకులకూ వ్యక్తిగత ఇబ్బందులకూ కదలని రవీంద్రబాబు.. తండ్రిగా మాత్రం కదలకుండా ఉండలేకపోయారు. తనలాగే ఒబెసిటీతో బాధపడుతున్న కొడుకు సమస్య పరిష్కారం కోసం జిమ్‌లో జాయిన్ చేయాలనుకున్నారు. ‘రెండున్నరేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని యాడ్‌లైఫ్‌లో మా అబ్బాయిని  జాయిన్ చేశాను. అక్కడి యాంబియన్స్ చూసి ఇన్‌స్పైర్ అయ్యా. తర్వాత నేనూ జాయినయ్యా. అంతే నా లైఫ్‌స్టైల్ మారిపోయింది.  వైట్‌రైస్‌తో పాటు అన్ని రకాల రైస్ మానేశాను. బ్యాడ్ హ్యాబిట్స్, పార్టీలు, అర్ధరాత్రులు దాటాక పడుకోవడం మానేశా. ఏడాదిలో 12 కిలోలు తగ్గాను’ అంటూ వివరించారు.
 
 సెకండియర్.. సిక్సర్
 దాదాపు 15కిలోలు తగ్గగానే  క్లోజ్ సర్కిల్‌లో వస్తున్న గుర్తింపు, ప్రశంసలు రవీంద్రబాబును మరింత మోటివేట్ చేశాయి. రెండో ఏడాది వర్కవుట్ టైమ్ గంట నుంచి 2గంటలకు పెంచారు.  నేను సిక్స్‌ప్యాక్ సాధించిన
 క్రెడిట్ ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్‌దే. దాదాపు 20 కిలోల వెయిట్ తగ్గాను. నాలుగు నెలలు ప్రతి రోజూ నాలుగు గంటలు వర్కవుట్స్ చేశాను.
 
  హై ప్రొటీన్‌డైట్, తక్కువ కార్బొహైడ్రేట్స్...  
 చపాతీలు సైతం మార్చేసి ఓట్స్ ఇలా మార్చుకుంటూ స్పీడ్ పెంచారు. దాంతో వెయిట్ తగ్గడం అనేది అలవాటైపోయింది. రెగ్యులర్  వర్కవుట్స్‌తో ఇక డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లకు మందుల అవసరం తగ్గిపోయింది.     ‘నేను సిక్స్‌ప్యాక్ సాధించిన క్రెడిట్ ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్‌దే’అంటారు రవీంద్రబాబు. దాదాపు 20కిలోల వెయిట్ తగ్గాక తాను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని నిజం చేద్దామంటూ ఆర్గనైజ్డ్ వర్కవుట్‌తో అనూహ్యమైన షేప్‌ను సాకారం చేశాడంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ‘‘సిక్స్‌ప్యాక్ అన్నప్పుడు నా శ్రీమతి ఆందోళన చెందింది.
 
  ఫిట్‌గా ఉన్నారు చాలు కదా అంత కష్టం అవసరమా అంది. అయితే వెంకట్ ప్రోత్సాహంతో 4 నెలల పాటు రోజుకు 4గంటల చొప్పున వర్కవుట్స్ చేశాను. సాధించాను. అప్పట్లో స్టమక్ సైజ్ 44దాకా ఉండేది. ఇప్పుడు 32-34 మధ్యలో ఉంటుంది. బరువు 72 కిలోలకు చేరింది. ఫిట్‌నెస్ విషయంలో డైటింగ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అలాగే సరైన ట్రైనర్ కూడా ముఖ్యమే. ప్రారంభంలో నాకున్న హెల్త్ ప్రాబ్లెమ్స్ వల్ల... పెయిన్స్, అనీజీనెస్ వచ్చేది. అయితే వెంకట్ అనుక్షణం నాకు టచ్‌లో ఉండేవాడు. ప్రతి దానికీ తన దగ్గర ఆన్సర్ ఉండేది’’ అంటూ తన ట్రైనర్‌కు థ్యాంక్స్ చెబుతారు.
 
 ఒబెసిటీ టు సెలబ్రిటీ...
 ‘ప్రస్తుతం పూర్తిగా డయాబెటిస్ మందులు మానేశాను. బీపీ డోస్ కూడా తగ్గించేశా. నా సర్కిల్‌లో నేనిప్పుడు సెలిబ్రిటీగా మారిపోయాను’ అంటారు ఆనందంగా రవీంద్రబాబు. ముఖ్యంగా తన ఏజ్ గ్రూప్‌లో ఇంత ఫిట్‌గా ఉండడం తనకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని, ప్రస్తుతం లైప్ కూడా చాలా బావుందంటూ థ్యాంక్స్ టూ వర్కవుట్స్ అంటున్నారు.  
 
 ఏజ్‌తో సమస్య లేదు...
 లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు వంటివి ఖరీదైనవి అలాగే వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా సరే వీలైనంత వరకూ  వెయిట్‌లాస్‌కు నాచురల్ పద్ధతుల్లో ప్రయత్నించడమే బెటర్. గత కొంతకాలంగా విభిన్న వయసుల వారు అదీ హెవీ వెయిట్ ఉన్నవారి చేత సిక్స్‌ప్యాక్ చేయించగలిగాను. శరీరాన్ని చక్కగా మార్చుకోవాలనే సంకల్పం కష్టించే తత్వం ఉండాలే కాని ఏ ఏజ్ వారైనా సరే బరువు తగ్గించుకోవడం మాత్రమే కాదు సిక్స్, ఎయిట్ ప్యాక్‌లు సాధించడమూ సాధ్యమే. అందుకు రవీంద్రబాబు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
 -ఎం. వెంకట్, ఫిట్‌నెస్ ట్రైనర్
 -  ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement