భార్య సువర్ణతో చంద్రశేఖర్ (ఫైల్)
ఈతకు వెళ్లి గల్లంతు..
Published Fri, Aug 12 2016 9:26 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు
గజ ఈతగాళ్ళతో ఎన్నెస్పీ కాలువలో గాలింపు
సత్తెనపల్లి: ఈతకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్కరాజుగార్లపాడ్డు రోడ్డులో నివశిస్తున్న ఆర్టీసీ డ్రై వర్ కె.భజంగరావు, పద్మావతి కుమారుడు కన్నెగంటి చక్రధర్ (27) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర కిందట వివాహమైంది. కృష్ణా పుష్కరాలకు బెంగళూరు నుంచి సత్తెనపల్లి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సమీపంలోని విద్యుత్ ప్లాంట్ వద్ద గల ఎన్నెస్పీ కాలువలో లాకుల వద్ద ఈత కొట్టేందుకు వెళ్లాడు. లాకుల వద్ద 20 అడుగుల పై నే లోతు ఉండే అవకాశం ఉందని భావించిన ఇద్దరు స్నేహితులు దిగేందుకు వెను కాడగా చక్రధర్ ఒక్క సారిగా ఈత కొట్టేందుకు కాలువలోకి దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో చక్రధర్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో హుటాహుటీన తండ్రి భుజంగరావు, బంధువులు, ఆర్టీసీ ఉద్యోగులు సమీప ప్రజలు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి సరఫరాను కొంత ఆపించారు. గజ ఈతగాళంల ద్వారా వెతుకులాటను ప్రారంభించారు. ఒక్కగానొక్క కుమారుడు...అల్లారు ముద్దుగా పెంచుకున్నాం... చేతికి వచ్చే తరణంలో మాకు దేవుడు తీరని వేదన పెట్టాడు అంటూ చక్రధర్ తల్లిదండ్రులు భుజంగరావు, పద్మావతి, భార్య సువర్ణ కన్నీరు మున్నీరయ్యారు.
Advertisement