
ట్యాంకర్‌ను ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్ వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.
కోదాడ అర్బన్ : మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్ వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ హన్మకొండకు చెందిన వద్దిరాజు శ్రీనా«థ్ (38) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం గురువారం రాత్రి కోదాడ మీదుగా విజయవాడకు వెళ్లేందుకు తన కారులో బయలుదేరాడు. మండల పరిధిలోని నల్లబండగూడెంలోని రామాపురం క్రాస్‌రోడ్ సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపి ఉంచిన ట్యాంకర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనాథ్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయంపై తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనా«థ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా, మృతుడి భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు.