
రేణిగుంట: తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ జోహో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నలుగురు భారతీయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఒకరు ఏపీకి చెందిన వారన్నారు. రాష్ట్రంలో తాము ఐటీ కంపెనీలతో పోటీపడుతూ టైం గవర్నెన్స్ చేస్తూ మార్చి నెలాఖరుకల్లా పేపర్‌లెస్ కార్యాలయాలను తయారు చేస్తామన్నారు. జోహో కంపెనీ తిరుపతిలో నెలకొల్పడం సంతోషకరమన్నారు.
మౌళిక వసతులను అభివృద్ధి చేసుకునేందుకు ఎంతభూమి, ఎక్కడ అవసరమో చెప్పాలని, ఆ మేరకు వెంటనే ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. విశాఖ, అమరావతి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వివరించారు. అమెరికాలో సిలికాన్‌వ్యాలీ లాగా విశాఖ నుంచి అనంతపురం వరకు ఆంధ్రావ్యాలీగా అభివృద్ధి చేస్తామన్నారు. తర్వాత సీఎం తిరుపతి మంగళం వద్ద ఐటీ టెక్‌హబ్ ఏజీఎస్ హెల్త్ ఐటీ కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రులు లోకేశ్, అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఐటీశాఖ రాష్ట్ర కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వెంబు, చీఫ్ ఎవాంజలిస్ట్ రాజు వేగ్రేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment