ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. | Software employee Harassment a colleague in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

Published Fri, May 12 2017 6:13 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. - Sakshi

ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలంటూ తోటి ఉద్యోగిని వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన చరణ్ చౌదరి ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తోటి ఉద్యోగిని ఒకరిని ప్రేమ, పెళ్లి పేరుతో వెంటపడి అల్లరి చేస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలో గురువారం సాయంత్రం చరణ్ ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు.

తనను పెళ్లి చేసుకోవాలని  మరోసారి ఆమెను కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆమె పదేపదే నిరాకరించడంతో విసుగు చెందిన చరణ్ ఆమెపై దాడికి దిగాడు. ఆ యువతిని కొట్టి, గోడకేసి బలంగా గుద్దాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ చౌదరిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement