ముంబై: ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌లపై దేశీ కంపెనీలు ఈ ఏడాది చైనాను మించి ఖర్చు చేయనున్నాయి. ఈ వ్యయాల విషయంలో చైనా వృద్ధి 18.9 శాతం ఉండనుండగా.. భారతీయ ఐటీ కంపెనీల వృద్ధి 19.8 శాతం మేర ఉండనుంది. అయితే, విలువపరంగా చూస్తే మాత్రం చైనా పరిమాణం భారీగా ఉండనుంది.
ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌పై భారత కంపెనీల వ్యయాలు 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. చైనా సంస్థల వ్యయాలు ఏకంగా 5.1 బిలియన్ డాలర్ల మేర ఉంటాయని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్ ఒక నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత స్థాయిలో కాకుండా.. కంపెనీల స్థాయిలో ఉపయోగించే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌పై ఇరు దేశాల వ్యయాలు చాన్నాళ్లుగా రెండంకెల స్థాయిలోనే ఉంటోందని, ఇకపైనా ఈ ధోరణి కొనసాగనుందని గార్ట్‌నర్ రీసెర్చ్ డైరెక్టర్ కీత్ గట్‌రిడ్జ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment