రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో ఎన్నికల వివరాలు, ఓటర్లు, అభ్యర్థుల సమాచారంతో కొత్తగా ఎలక్టోరల్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఎన్నికలు, ఏర్పాట్ల గురించి సమీక్షించారు. జిల్లాలో జరిగిన సాధారణ, మున్సిపల్ జనరల్ బాడీ ఎన్నికల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇకపై ఎలక్టోరల్ సాఫ్ట్‌వేర్‌తో ఏ ఎన్నికలు నిర్వహించినా అత్యంత సులువుగా, వేగంగా ఎన్నికల వివరాలన్నీ తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల ఓటర్ల జాబితాను సరళీకృతం చేసి, దానిని ఈ సాఫ్ట్‌వేర్‌లో తెలుసుకోవచ్చని వివరించారు. ఈ వెబ్‌సైట్‌లో ఎన్నికల నియమ నిబంధనలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు. అఫిడవిట్ తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.