తాళం వేసి రాత్రి డ్యూటీకి వెళ్లిన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి తాళాలు పగుల కొట్టి 25 తులాలు బంగారు ఆభరణాలు, 25 తులాలు వెండి వస్తువులు దోచుకెళ్లారు. ఈ సంఘటన గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, బాధితుడు తెలిపిన వివరాలు.. జమ్మూకు చెందిన హనిత్‌సింగ్ కొంత కాలంగా కుటుంబ సభ్యులతో కలిసి బోడుప్పల్ అంజయ్య ఎన్‌క్లేవ్‌లో వుంటున్నాడు. హబ్సిగూడలోని జెన్‌ప్యాక్ లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం భార్య డెలివరీ కోసం జమ్మూకు వెళ్లింది. అప్పటి నుంచి హనిత్‌సింగ్ ఒక్కడే ఉంటూ డ్యూటీకి వెళుతున్నాడు. ఈక్రమంలో రోజు మాదిరిగా బుధవారం రాత్రి హనిత్‌సింగ్ డ్యూటీకి వెళ్లాడు. తెల్లవారి వచ్చేసరికి ఇంటి సెంటర్ లాక్ పగులకొట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా బట్టలు, వస్తువులు అన్ని చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 25 తులాలు బంగారు ఆభరణాలు, 25 తులాలు వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డి, ఎస్‌ఐ నవీన్‌బాబు, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. హనిత్‌సింగ్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
Published Thu, Sep 1 2016 6:59 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement