దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ హవా చూపుతోంది. వరుసగా ఐదో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 40,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ప్రస్తుతం 434 పాయింట్లు పెరిగి 10,313ను తాకింది. నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 11,866 వద్ద ట్రేడవుతోంది.
సహాయక ప్యాకేజీపై తిరిగి అంచనాలు పెరగడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. దీంతో సెంటిమెంటుకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఆటో అప్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఐటీ 4.25 శాతం జంప్‌చేయగా.. మెటల్, రియల్టీ, ఆటో 1.6-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్‌బీఐ, మారుతీ, ఇండస్‌ఇండ్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, టైటన్, కోల్ ఇండియా, టైటన్, ఐటీసీ, ఐవోసీ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఐటీ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో మైండ్‌ట్రీ, కోఫోర్జ్, బంధన్ బ్యాంక్, ఎల్‌ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, ఐబీ హౌసింగ్, ఎన్‌ఎండీసీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐడియా 5.3-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. అదానీ ఎంటర్, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ ప్రు, టాటా పవర్, ఎంజీఎల్, ఏసీసీ, పేజ్ 1.6-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,111 షేర్లు లాభపడగా.. 593 నష్టాలతో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment