సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది. 2023, మార్చ్ 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు.
మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే.. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి మే రెండో వారం దాకా ప్రాక్టికల్స్ కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment