సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 28న పదో తరగతి సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి 30 వరకు నిర్వహించేందుకు టైం టేబుల్ జారీ చేసినట్లు గురువారం పేర్కొన్నారు. అందులో మార్చి 29న సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్ష నిర్వహించేలా ఉందని, అయితే 29న ఉగాది పండుగ ఉన్నందున, ఆ పరీక్షను ఒకరోజు ముందుగా, 28న నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. 30న సోషల్ స్టడీస్ పేపర్–2 పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.