
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.
పూణెలోని మండై మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.
ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
पुणे के मेट्रो स्टेशन में लगी आग
महाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024
ఇది కూడా చదవండి: పిరమిడ్‌పై పక్షుల వేట