
కర్ణాటక: సాంకేతిక సమస్య కారణంగా మంగళవారం ఉదయం 7.35 సమయంలో సిగ్నల్ సమస్య తలెత్తడంతో కెంగేరి–బయప్పనహళ్లి మధ్య నడిచే మెట్రో రైలుకు అంతరాయం ఏర్పడింది. అత్యంత రద్దీగా ఉండే సమయంలో సిగ్నల్ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల కొద్ది వేచి చూసినా ఫలితం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో బస్సులు, ఆటోలను ఆశ్రయించారు.
ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు సంచరించాలి, సిగ్నల్ సమస్య నేపథ్యంలో పది నిమిషాలకు ఒక రైలు సంచరిస్తుండటంతో వెంటనే మరమ్మతులు చేపడుతామని బీఎంఆర్‌సీఎల్ అధికారులు తెలిపారు. బయప్పనహళ్లి స్టేషన్ వద్ద సిగ్నల్ సమస్య ఏర్పడగా, ఇందిరానగర వరకు సమస్య తలెత్తలేదు. మంగళవారం రాత్రి రైళ్ల సంచారం నిలిపివేసి మరమ్మతులు చేపడుతామని బీఎంఆర్‌సీఎల్ తెలిపింది.