
మళ్లీ పట్టాల మీదకు రీరైల్‌ను చేర్చుతున్న దృశ్యాలు
కర్ణాటక: రాజధానిలో నమ్మ మెట్రో గ్రీన్ మార్గంలో రీ రైలు అనే తనిఖీ వాహనం పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు మార్గంలో మెట్రో రైళ్ల సంచారానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున రాజాజీ నగర మెట్రోస్టేషన్ – మహాకవి కువెంపు స్టేషన్ మధ్య మెట్రో వంతెన పట్టాలపై వెళ్తున్న రీ రైల్ పట్టాలు తప్పి పై నుంచి కిందకు పడిపోయింది. మామూలుగా మెట్రో సిబ్బంది పట్టాలు తనిఖీలు, మరమ్మతులు చేయడానికి రీ రైల్‌లో వెళ్తూ ఉంటారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియే, అయితే వాహన డ్రైవర్ అలసత్వం వల్ల అది కిందపడిపోగా అదృష్టవశాత్తు ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
పలు సర్వీసులకు బ్రేక్
ఈ సంఘటనతో గ్రీన్‌లైన్లో మెట్రో రైళ్ల సంచారాన్ని అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది. ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు రైళ్లు లేక ఇబ్బంది పడ్డారు. నాగసంద్ర నుంచి యశవంతపుర, సెంట్రల్ సిల్క్‌బోర్డ్ నుంచి మంత్రి మాల్ మాత్రమే మెట్రో రైళ్లు సంచరించాయి. టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రైళ్లు రాకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఇతర వాహనాల్లో ఆఫీసులకు పరుగులు తీశారు. దీంతో బీఎంటీసీ అధికారులు యశవంతపుర నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక బస్సులను తిప్పారు. సాయంత్రం నుంచి రైళ్లు మళ్లీ మామూలుగా తిరిగాయి.
మరోవైపు కిందపడిపోయిన రీ రైలును తిరిగి పట్టాలపైకి తెచ్చేందుకు భారీ క్రేన్‌ను తెప్పించారు. ఎంతో ప్రయత్నం చేయగా మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మెట్రో ట్రాక్ మీదకు తెచ్చి తీసుకెళ్లారు. ఈ ఘటనలో అందులోని సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

మెట్రో వంతెన నుంచి కిందకు పడిన రీరైల్

Comments
Please login to add a commentAdd a comment