మెట్రో స్టేషన్‌లో, రైలులో మార్ఛవచ్చినట్లు ప్రాంక్ చేస్తున్న యూట్యూబర్ ప్రజ్ఞు
కర్ణాటక: మెట్రో రైలులో కొందరు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు పెడుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరు మెట్రోలో అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది. విజయనగర నుంచి మెజిస్టిక్‌కు ప్రయాణించే సమయంలో ఓ యూట్యూబర్ తొలుత ఎస్కలేటర్‌పై వస్తూ మూర్ఛ వచ్చినట్లు ప్రాంక్ వీడియో చేసి ప్రయాణికులను గాభరా పెట్టాడు. అనంతరం మెట్రోలో ప్రయాణిస్తూ మూర్ఛవచ్చినట్లు నటించి ప్రయాణికులను షాక్‌కు గురిచేశాడు.
అనంతరం ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ ఘటనను బీఎంఆర్‌సీఎల్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులను కంగారుపెట్టిన యువకుడి సమాచారం సేకరిస్తున్నారు. అతడి పేరు ప్రాంక్ ప్రజ్ఞు అని తెలిసింది. ముంబై, న్యూఢిల్లీ మెట్రోలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగుచూడగా ప్రస్తుతం బెంగళూరులో జరిగింది.
మెట్రో ప్రయాణికుడిపై కేసు
నమ్మ మెట్రోరైలులో గోబిమంచూరి తిన్న ప్రయాణికుడిపై బీఎంఆర్‌సీఎల్ కేసు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.500 జరిమానా విధించింది. బీఎంఆర్‌సీఎల్‌లో ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కేసు నమోదైన వ్యక్తి నమ్మమెట్రోలో జయనగర నుంచి సంపిగే రోడ్డు మధ్య నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి గోబిమంచూరి తీసుకువచ్చి అక్కడే తిన్నాడు. తోటి స్నేహితులు వారించారు. ఈ వీడియోను ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. బీఎంఆర్‌సీఎల్ కేఆర్.మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment