కేఆర్.పురంలో మెట్రో రైలులో కిటకిట
బనశంకరి: ప్రైవేటు వాహనాల బంద్ వల్ల మెట్రో రైళ్లు నిలబడానికి కూడా స్థలం లేకుండా కిటకిటలాడాయి. మెట్రో స్టేషన్లకు భారీఎత్తున ప్రయాణికులు తరలివచ్చారు. దీంతో మెట్రో సంస్థ రెండు మెట్రో రైళ్ల మధ్య సంచార అవధిని ఐదు నిమిషాలకు తగ్గించింది.
సాధారణంగా వేకువజామున ప్రతి 10 నిమిషాలకు ఒకరైలు సంచరిస్తుంది. ఉదయం 8 గంటలనుంచి 11.30 వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడిపినట్లు సంస్థ అధికారులు తెలిపారు. స్టేషన్లలో టోకెన్ తీసుకోవడం దగ్గరనుంచి అన్నిచోట్లా జనసమ్మర్ధం కనిపించింది. సిటీ బస్సుల్లో మాదిరిగా పెద్దసంఖ్యలో నిలబడి ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment