హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.59కే రోజంతా ప్రయాణం చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’ ప్రవేశపెట్టింది. ప్రయాణికులు రూ.59 చెల్లించి సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా ఆగస్టు 12, 13, 15 తేదీల్లో అపరిమితమైన మెట్రో రైడ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికుల కోసం ఎంతో విలువైన ఆఫర్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment