హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ నెల 3న రికార్డు స్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. మెట్రో రైలు ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. నగరంలోని వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న మెట్రోరైళ్లు ప్రతి నిత్యం కిటకిటలాడుతున్నాయి.
అత్యంత నాణ్యమైన, మెరుగైన పర్యావరణహితమైన రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న మెట్రోకు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోందని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని మెట్రో ట్రిప్పులు అందుబాటులోకి వస్తాయన్నారు.
మియాపూర్ –ఎల్‌బీనగర్ టాప్...
నగరంలోని మొదటి కారిడార్ మియాపూర్–ఎల్‌బీనగర్ ప్రయాణికుల సంఖ్యలో టాప్‌లో నిలిచింది. సోమవారం ఈ కారిడార్‌లో 2.60 లక్షల మంది ప్రయాణం చేశారు. ఆ తర్వాత మూడో కారిడార్ నాగోల్– రాయదుర్గం రెండో స్థానంలో ఉంది. 2.25 లక్షల మంది ఈ రూట్‌లో పయనించారు. రాయదుర్గం స్టేషన్ నుంచి అత్యధికంగా 32,000 మంది ప్రయాణం చేయగా, ఎల్‌బీ నగర్ నుంచి 30,000 మంది ప్రయాణం చేశారు. అమీర్‌పేట్ నుంచి 29,000, మియాపూర్ నుంచి 23000 మంది రాకపోకలు సాగించినట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment