TS: మెట్రో రైలెక్కిన హరీశ్‌రావు | Former Minister Harishrao Commutes In Metro Rail In Hyderabad | Sakshi
Sakshi News home page

మెట్రో రైలెక్కిన హరీశ్‌రావు

Dec 30 2023 8:35 PM | Updated on Dec 30 2023 8:53 PM

Former Minister Harishrao Commutes In Metro Rail In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ  మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఎల్బీనరగ్‌ స్టేషన్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తూ సరదాగా  ప్రయాణికులతో ముచ్చటించారు.

నాగోల్ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని రవీంద్రభారతిలో మరో కార్యక్రమానికి వెళ్లేందుకు హరీశ్‌రావు మెట్రో రైలెక్కారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా  మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించిన విషయం తెలిసిందే. 

ఇదీచదవండి..కొండా సురేఖ, పల్లా వాగ్వాదం ఎందుకంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement