ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ కోఫౌండర్, సీటీవో గుంజన్ పటిదార్ తన పదవికి రాజీనామా చేశారు. స్టార్టప్ నుంచి మార్కెట్ కేపిటల్ వేలకోట్ల విలువైన సంస్థగా జొమాటోను తీర్చిదిద్దిన వారిలో పటిదార్ ఒకరంటూ మార్కెట్ రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జొమాటో తెలిపింది.
గత పదేళ్లకుపైగా గుంజన్ తన సామర్ధ్యంతో సంస్థ కేపిటల్ వ్యాల్యూని,విలువల్ని పెంచేలా టెక్నాలజీ, మహిళా ఉద్యోగుల్ని నిష్ణాతులైన నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇలా ఆయన సంస్థకు చేసిన సేవలు వెలకట్టలేవని ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే కంపెనీ నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు.
తలోదారి చూసుకుంటున్నారు
సంస్థ పనితీరు, కోవిడ్ భయాలు, ఆర్ధిక మాంద్య ప్రభావం..లేదంటే ఇతర కారణాలు కావొచ్చు. గతేడాది నుంచి జొమాటోలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగులు ఆ సంస్థ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. తలోదారి చూసుకుంటున్నారు.
గతేడాది నవంబర్‌లో
గతేడాది నవంబర్‌లో మరో కోఫౌండర్ మోహిత్ గుప్తా జొమాటోకు గుడ్‌బై చెప్పారు. నాలుగున్నరేళ్ల క్రితం జొమాటోలో చేరిన గుప్తా..2020లో దాని ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ పదవి నుంచి సహ వ్యవస్థాపకుడిగా ప్రమోషన్ పొందారు. ఇప్పటికే ఇంటర్‌సిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్,సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తాలు రాజీనామా చేసిన వారిలో ఉన్న విషయం తెలిసిందే.
చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్
Comments
Please login to add a commentAdd a comment