ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కో ఫౌండర్ మోహిత్ గుప్తా ఆ సంస్థకు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రిజైన్‌పై నోట్‌ను విడుదల చేసిన గుప్తా.. అందులో జొమాటో సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
‘సంవత్సరాల తరబడి మేము నేర్చుకున్న ప్రతిదానిని మీరు కొనసాగించడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కనికరం లేకుండా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ప్రపంచానికి రోల్ మోడల్‌గా ఉండేలా సంస్థను నిర్మించండని’ అని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ జొమాటోను లాభదాయకమైన వ్యాపారం గా మార్చేందుకు ఫౌండర్ దీపిందర్ గోయల్, ఉద్యోగుల్ని కృషి చేశారని గుప్తా ప్రశంసించారు.
గత కొన్ని సంవత్సరాలుగా దీపిందర్ గోయల్ మరింత పరిణతి చెందిన, నమ్మకమైన లీడర్‌గా మారడం నేను చూశాను. అతను ఇప్పుడు మీ అందరితో కలిసి వ్యాపారాన్ని ఉజ్వలమైన భవిష్యత్తుకు నడిపించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment