
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్మూరు నియోజక వర్గ బీజేపీ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఎంపీ అరవింద్‌తో వినయ్‌కి పడటం లేదు.
చివరకు.. ఎంపీ అరవింద్ వ్యతరేకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇటీవల ఆందోళన సైతం చేపట్టారు వినయ్. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆయన పార్టీ మారుతుండడం చర్చకు దారి తీసింది. వినయ్ 2018 లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు వినయ్. ఆ ఎన్నికల్లో దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఈ దఫా ఆర్మూర్ టికెట్ ఆశావాహుల్లో ఈయన కూడా ఉన్నారు.
బీజేపీని వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినయ్ బయటకు రావడం.. జిల్లాలో కమలం పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
Comments
Please login to add a commentAdd a comment